అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్ ను స్వయంగా కలిసిన అంబేద్కర్ కాలనీ వాసులు
(ఆళ్లపల్లి విజయం న్యూస్ ):-
పరిధిలోని మర్కోడు పంచాయతీ అంబేద్కర్ కాలనీ వాసులు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి అంబేద్కర్ కాలనీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై స్వయంగా వారికి విన్నవించారు అనంతరం ప్రభుత్వ విప్ రేగ కాంత రావు స్పందించి తప్పకుండా మీ మండలంలోని పంచాయతీలోని అంబేద్కర్ కాలనీ లో అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కీసరి నరేష్, ఇనుముల సమ్మయ్య, బొమ్మెర ముసలయ్య, బొమ్మెర సమ్మయ్య పాల్గొన్నారు