Telugu News

చంచల్ గూడ జైల్లో ఎన్ఎస్ యుఐ నాయకులతో రాహుల్ గాంధీ ములాకత్

హైదరాబాద్-విజయం న్యూస్

0

చంచల్ గూడ జైల్లో ఎన్ఎస్ యుఐ నాయకులతో రాహుల్ గాంధీ ములాకత్

(హైదరాబాద్-విజయం న్యూస్);-

చంచల్ గూడ జైల్లో తెలంగాణ ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, తోటి విద్యార్థులను, నాయకులను ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ములాకత్ అయ్యారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సటీలో ఎన్ఎస్ యుఐ నిర్వహించిన నిరసనలో భాగంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తో సహా 17 మందితో కూడిన సంఘం నాయకుల బృందాన్ని 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైల్లో నిర్బంధించిన విషయం విధితమే. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ జైల్ లో ములాకత్ అవుతానని ప్రకటించారు. ఈమేరకు కాంగ్రెస్ నాయకులు ములాకత్ కోసం జైలర్ కు వినతి చేసుకోగా, శుక్రవారం సాయంత్రం ములాకత్ కు అవకాశం కల్పించారు.

also read ;-ప్యారివేర్, జాన్సన్ టైల్స్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్సీ మధు, మేయర్

రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్కతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ములాకత్ కు అవకాశం కల్పించారు. అయితే శనివారం రాహుల్ గాంధీ తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రమే ములాకత్ కు హాజరైయ్యారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి బృందాన్ని కలిసిన రాహుల్ గాంధీ విద్యార్థులకు, యువతకు అండగా ఉంటానని, ఎవరు భయపడోద్దని, మీపై కేసులు పెట్టిన వారి సంగతేంటో చూస్తామని భరోసాకల్పించారు. దైర్యంగా ఉండాలని, మీ వెంట నేను ఉంటానని దైర్యం చెప్పారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులతో గ్రూపుపోటో దిగారు. ములాకత్ కు అవకాశం కల్పించిన జైలర్ కు సీఎల్పీనేత భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు