Telugu News

గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించాలి : మంత్రిపువ్వాడ

ఆశావర్కర్లకు మొబైల్స్ పంపిణి చేసిన మంత్రి, కలెక్టర్

0

===గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించాలి : మంత్రిపువ్వాడ
== =ఆశావర్కర్లకు మొబైల్స్ పంపిణి చేసిన మంత్రి, కలెక్టర్
===(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
సర్కారు దవాఖానాలలోనే ఉచితంగా అత్యాధునిక, అద్భుత వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజా ఆరోగ్య సమాచార విస్తరణకై స్మార్ట్ ఫోన్లను సద్వినియోగపర్చుకొని మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలకు మొబైల్ ఫోన్స్ పంపిణిలో భాగంగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తో కలిసి ఆశా కార్యకర్తలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్మార్ట్ ఫోన్సను అందజేశారు.

also read :-కందాళ పార్టీ ద్రోహి.. : భట్టి

రఘునాథపాలెం మండలం మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ మండలంలో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల 140 మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్సను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఆశా కార్యకర్తలకు సరైన ప్రోత్సాహకం లభించలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర్ రావు ఆశాల పారితోషికాన్ని అంచెలంచెలుగా పెంచుతూ ప్రస్తుతం 9,750/ – రూపాయలకు పెంచారని, జిల్లాలోని 1350 మంది ఆశా కార్యకర్తలకు ఈ నెల నుండే పెరిగిన పారితోషికం అందించడం జరిగిందన్నారు.

ఆరోగ్య సేవల రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని కె.సి.ఆర్ కిట్స్, నగదు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు పొందేలా ఆశా కార్యకర్తలు గ్రామీణ స్థాయి నుండి అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకొని రావాలన్నారు. ప్రధానంగా మాతా-శిశు సంరక్షణ సేవా కార్యక్రమాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా మరింత సమర్ధవంతంగా పనిచేయాలని మంత్రి అన్నారు.

also read :-కాంగ్రెస్ పార్టీ పదవులపై ఠాగూర్ సంచలన ప్రకటన

కరోనా క్లిష్టసమయంలో ఆశాల సేవలు అభినందనీయమని, ఇంటింటి జ్వరసర్వే, వ్యాక్సినేషన్ విజయవంతం చేయడంలో ఆశాలు ప్రధాన భూమిక పోషించారని మంత్రి అభినందించారు. ఇక ముందు ప్రజా ఆరోగ్య సేవల సమాచార సేకరణ, డేటా ఎంట్రీ ప్రక్రియ ఆన్లైన్ పద్ధతిలోనే జరగాలని, అందుకు గాను ఆశాలకు స్మార్ట్ ఫోన్స్ అందిస్తున్నామని స్మార్ట్ ఫోన్ ద్వారా మరింత వేగవంతంగా వైద్య సేవల సమాచార ప్రక్రియ జరగాలని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఆశా కార్యకర్తలు అద్భుతమైన సేవలు అందించారని, కోవిడ్ పేషెంట్ల ఇండ్లకు వెళ్ళి వైద్యసేవలు, హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించి ప్రాణాపాయం నుండి కాపాడారని, వ్యాక్సినేషన్ రెండు విడతలు వందశాతం పూర్తి చేసుకొని మన జిల్లా రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచిందని, ఇదే స్పూర్తితో ఇకముందు సాధారణ ప్రజా ఆరోగ్య వైద్య సేవల పట్ల మరింత దృష్టి సారించాలని ఆశా కార్యకర్తలకు జిల్లా కలెక్టర్ సూచించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ 2005లో ఆశా సేవలు ప్రారంభమయినప్పటికి 2014 తర్వాతనే ఆశాలకు తగిన ప్రోత్సాహం లభించిందన్నారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, ప్రయివేటు ఆసుపత్రులకు ధీటుగా కార్పోరేషన్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందించే విధంగా అభివృద్ధిపర్చామని, ప్రజల ఆరోగ్య, ఆర్ధిక రీత్యా మేలు జరిగేలా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలు ప్రజలు పొందేవిధంగా ఆశాలు మరింత శ్రద్ధతో పనిచేయాలని ఆయన అన్నారు. వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములునాయక్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్న్ సురభి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాలతీ,జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, డాక్టర్ సైదులు, నీలోహాన, ఆశా కర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.