Telugu News

ములుగు టిఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ బరిలో పులుసం పురుషోత్తం ?

ములుగు లో మారుతున్న రాజకీయ సమీకరణాలు

0

ములుగు టిఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ బరిలో పులుసం పురుషోత్తం ?

—-ములుగు లో మారుతున్న రాజకీయ సమీకరణాలు

—-జీసీసీ డైరెక్టర్గా, భార్య జడ్పిటిసి గా ఎన్నో పదవులు

—-సీతక్క ను ఎదుర్కోవాలంటే బలమైన నాయకుడు కావాలంటున్న ప్రజలు……

(గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్):-

ములుగు నియోజకవర్గంలో రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బరిలో దిగనున్నారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క బరిలో ఉండనుండగా అదే సామాజిక వర్గానికి చెందిన ములుగు జిల్లా సమ్మక్క- సారక్క తాడ్వాయి మండలంలోని పంభాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన ఉద్యమ బిడ్డ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ లిమిటెడ్ (జి సి సి) డైరెక్టర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక దృక్పథం కలిగిన ఉన్నత విద్యావంతుడు, నాయకత్వ లక్షణాలు ఉండి నిరంతరం నిత్యం పేద ప్రజలకు అండగా ఉంటూ సామాజిక రాజకీయ సేవ గుణం కలిగిన పులుసం పురుషోత్తం అలియాస్ మురళి కి తెరాస పార్టీ నుంచి ములుగు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పావులు కదుపుతూ అధిష్టానం ఆదేశిస్తే పోటీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

also read;-వరి కొనుగోలు కేంద్రం పరిశీలించిన జువ్వాడి కృష్ణారావు ….

రాజకీయాలలో నాయకులతో, కార్యకర్తలతో అఫిషియల్ తో కలిసి మెలిసి ఉంటూ నియోజకవర్గం లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కారం కోసం శ్రమిస్తూ ముందుకు వెళ్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో సీతక్క ను దీటుగా ఎదుర్కోవడానికి అదే సామాజిక వర్గానికి చెందిన ఉద్యమ నాయకుడు విద్యావంతుడు పులుసం పురుషోత్తం అలియాస్ మురళి అయితేనే బాగుంటుందని పార్టీ నాయకుల్లో, కార్యకర్తలు లో చర్చ జరుగుతుంది. ఆదివాసి లకే ములుగు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు రాష్ట్ర పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం, దాన్ని దృష్టిలో పెట్టుకుని పురుషోత్తం అలియాస్ మురళి పార్టీ పెద్దల ద్వారా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పురుషోత్తం అలియాస్ మురళి ఉద్యమ నాయకుడే కాకుండా ఎమ్మే బీఈడీ చదివిన విద్యావంతులు కూడా.. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు పులుసం పురుషోత్తం కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే బాగుంటుందని పలువురు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆయన అభిమానులు అనుకుంటున్నారు.

రాజకీయంగా మంచి అనుభవం ఉన్న కుటుంబం:

1980- 81 సంవత్సరంలో తాడ్వాయి మండలంలో నూతనంగా ఏర్పడ్డ పంభాపూర్ గ్రామ పంచాయతీకి మొట్టమొదటి సర్పంచ్ వీరి తండ్రి పులుసం సమ్మయ్య గారు. అనంతరం వారి తండ్రిగారైన పులుసం సమ్మయ్య 1982లో మాజీ దివంగత మంత్రి అజ్మీర చందూలాల్ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఆదేశానుసారం, వారితో కలసి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో టిడిపి పార్టీ లోకి చేరి కీలక పదవులకు న్యాయం చేశారు. 1985లో ఏటూరునాగారం సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించి ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి మూడు మండలాల ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. పులుసం పురుషోత్తం అలియాస్ మురళి అన్నయ్య పులుసం నాగేశ్వరావు ఎన్పీడీసీఎల్ వరంగల్ లో డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తూ అందరి ఉద్యోగుల ప్రజల మన్ననలు పొందుతున్నారు. వీరి బావ ఎట్టి వెంకన్న ఎస్ పి డి సి ఎల్ హైదరాబాద్ లో డివిజనల్ ఇంజనీర్ గా పని చేస్తూ అందరి ఉద్యోగుల, సమస్త ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఒక బావ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా, ఒక చెల్లి ప్రభుత్వ ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతారు.

also read;-టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ని కలిసిన బాధితులు

వీరి కుటుంబం ప్రజాసేవలో నిరంతరం పని చేస్తున్నారు. పులుసం పురుషోత్తం అలియాస్ మురళి కుటుంబం మొదటి నుంచి రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం. ఇక ములుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న అభ్యర్థి పులుసం పురుషోత్తం అలియాస్ మురళి 1995 జనవరి నెలలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ లో చేరి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. నాడు పీపుల్స్ వార్ పార్టీ, నేటి మావోయిస్టు పార్టీ లో దళ సభ్యుడు నుండి కమాండర్ ప్లాటూన్ కమాండర్ గా అంచెలంచెలు ఎదుర్కొంటూ, పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేశారు. చత్తీస్ఘడ్ రాష్ట్రం దర్భ జిల్లాలో డివిజనల్ లీడర్గా కూడా పనిచేసి అందరి సమస్త ప్రజల మన్ననలను పొందారు. ఇలా ఆయన రాజకీయ ప్రస్థానం 15 సంవత్సరాలు అడవి జీవితం గడిపి, 2008 మార్చి 15 రోజున జనజీవనస్రవంతిలో కలిసి ప్రజల్లో పని చేస్తున్నారు. 2014 ఏప్రిల్లో వారి సతీమణి పులుసం సరోజనపురుషోత్తం ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయించి జడ్పిటిసి గా మరెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో గెలిపించుకున్నారు. సౌమ్యుడు నిరాడంబరుడు గా పేరున్న పురుషోత్తం ములుగు నియోజకవర్గంలో అందరితో కలిసి మెలిసి ఉంటున్నారు. అనంతరం మాజీ మంత్రివర్యులు స్వర్గీయ అజ్మీర చందూలాల్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

also read;-జిహ్వ చాపల్యాన్ని అవకాశంగా మార్చకొన్నారు.

ఇప్పుడు పురుషోత్తం జిసిసి డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూ నియోజకవర్గంలో గిరిజనులలో మంచి పట్టున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ములుగు జిల్లా లో ఆయనకు మంచి పేరు కూడా ఉన్నది. జిల్లాలోని ఉన్న అన్ని మండలాల నాయకులతో, కార్యకర్తలతో పులుసం పురుషోత్తం అలియాస్ మురళికి అవినాభావ సంబంధాలు ఏర్పరుచుకున్నారు. జిల్లా అధ్యక్షులు, ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మరియు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత తో సైతం పురుషోత్తం కు సంబంధాలు ఉన్నాయి. రిమార్క్ లేని నాయకుడిగా ఎదిగి మంత్రి సైతం మెచ్చుకునే స్థాయికి ఎదిగినట్లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు అనుకుంటున్నారు. కాగా పురుషోత్తం అలియాస్ మురళి కి ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటిస్తే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశముందని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు చెప్పుకుంటున్నారు.