Telugu News

21 నుంచి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలి

== నెల రోజుల్లో అన్నీ గ్రామాలు పూర్తి చేయాలి

0

21 నుంచి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలి

== నెల రోజుల్లో అన్నీ గ్రామాలు పూర్తి చేయాలి

== విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-
దివంగతనేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఈ నెల21 నుంచి అన్ని మండలాల అధ్యక్షులు తమకు అందుబాటులో ఉన్న గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలలో జరిగిన రైతు సంఘర్షణ సభలో విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్ను రైతులకు వివరించాలని తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రచ్చబండ కార్యక్రమాలను ఈనెల 21 నుండి నెల రోజుల్లో అన్ని గ్రామాలలో పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు.

also read :-ప్రమాదాల నివారణకు పోలీసుల ముందస్తు చర్యలు

అంతేకాకుండా వరంగల్ రైతు డిక్లరేషన్ పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా కింద భూమి ఉన్న రైతుతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు, భూమిలేని ఉపాధిహామీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అలాగే అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, ఏ కారణం చేతనైనా పంట నష్టం జరిగితే పంట పంటల బీమా పథకం ద్వారా రైతులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు.

also read :-రాజ్యసభకు గాయత్రి రవి నామినేషన్

పోడు భూముల రైతులకు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పించడం, ధరణి పోర్టల్ రద్దు, నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ఉక్కుపాదం మోపడం, దానికి కారణమైన వ్యక్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అసంపూర్ణ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం. రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రైతు కమిషన్ ఏర్పాటు, లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా పనిచేసేందుకు నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక ఇటువంటి బృహత్తకరమైన అంశాలను ప్రతి రైతుకు వివరించాలని కోరారు. అన్ని మండలాల అధ్యక్షులు గ్రామాల్లో పర్యటించి రచ్చబండ ద్వారా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అమలు చేయునట్టి విధానాలను రైతులకు తెలియపరచాలని కోరారు.