నిస్సారమవుతున్న భూమిని రక్షించండి*
* భవిష్యత్ తరాలకు పోషక విలువలు కల ఆహారాన్ని అందించండి
*అశ్వారావుపేట చేరుకొన్న సైకిల్ యాత్ర
(అశ్వారావుపేట విజయం న్యూస్):-
నిస్సారమవుతున్న భూమిని(మట్టిని) రక్షించండి ,భవిష్యత్తు తరాలను పోషకాహరలోపం నుండి కాపాడమని పిలుపు నిచ్చారు,భానోతు వెన్నెల.సేవ్ సాయిల్ అనే నినాదంతో చేపట్టిన సైకిల్ యాత్ర గురువారం నాడు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట లోకి అడుగు పెట్టింది.ఈ సందర్భంగా అమె పత్రికల వారితో మాట్లాడారు. తాను జగ్గి వాసుదేవ్ గురూజి స్పూర్తితో తాను తెలంగాణ లొ సేవ్ సాయిల్ యాత్రను చేపట్టానని తెలిపారు. తాను మే ఒకటవ తేదిన కామారెడ్డి నుంచి ప్రారంభించానని జూన్ 20 వ తేదికి తన యాత్ర పూర్తి అవుతుందని తెలిపారు.విచక్షణారహితంగా వాడుతున్న రసాయనిక ఎరువులు,కలుషితాల వలన భూమి రోజు రోజుకు నిస్సారమయి పోతుందని తెలిపారు.ఇప్పుడు మేల్కొనక పోతే 2050 నాటికి 40 శాతం మాత్రమే అహరం లభిస్తుందని,అనేక ఇబ్బందులు ఏర్పడతాయని, పోషకాహార లోపంతో పాటు మానవాళి నిర్వీర్యం అయిపోతుందని అమె ఆవేదన వ్యక్తం చేసారు.మల్లా కోలు కోవాలంటే కనీసం నూటయాభై సంవత్సరాలు పడుతుందన్నారు.
also read :-21 నుంచి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలి
కాబట్టి తక్షణమే మేల్కొని మట్టిని రక్షించుకోవాలని అన్నారు.అందుకు గాను రసాయినిక ఎరువులు తగ్గించాలని,చెట్టు ఎక్కువ పెంచి నీడతో పాటు సేంద్రియ లక్షణాలు పెంచాలని,అందుకు పశువుల వ్యర్థాలు, వ్యవసాయపు వ్యర్దాలు ఉపయోగించాలని కోరారు.ప్రతి ఒక్కరు చైతన్య వంతులై తమ పరిధిలొ మట్టి రక్షణకు పూనుకోవాలని కోరారు.వాసుదేవ్ గురూజి 30000 కిలోమీటర్ల తిరుగుతున్నారని తెలిపారు.తాను తెలంగాణ వ్యాప్తంగా 5000 కిలోమీటర్లు తిరుగుతున్నట్లు తెలిపారు.
జనసేన, వాసవి క్లబ్ అధ్వర్యంలో సన్మానం
మట్టిని రక్షించు అనే నినాదంతో కామారెడ్డి కి చెందిన బానోతు వెన్నెల చేపట్టిన సైకిల్ యాత్ర అశ్వారావుపేట కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట కు చెందిన జనసేన బాధ్యులు డేగల రామచంద్ర రావు, వాసవి సభ్యులు, సుబ్బారావు, రాంబాబు, ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వెన్నల స్ఫూర్తి తో ప్రతి ఒక్కరు మట్టిని రక్షించాలని పిలుపు నిచ్చారు.దారి ఖర్చులకు కొంత నగదును వితరణ చేసారు.