తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యవర్గం
(విజయం న్యూస్ మల్లాపూర్):-
మహనుబావులు మహత్మ జ్యోతిబాపు పూలే, అంబేద్కర్ ఆశయాల కొనసాగింపులో బాగంగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ ( టిపిఎస్ జేఏసీ ) మల్లాపూర్ మండల అధ్యక్షులు గా ముద్ధం చంద్ర ప్రకాష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి గా పెంబి మహెందర్, ఉపాధ్యక్షులుగా సిద్ద బాలరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్మిగా హన్మండ్ల శివ, కోశాధికారిగా కొడిచెర్ల గంగారాం, కార్యదర్శిగా పుప్పాల మహేష్ లతో పాటు మరో ఆరుగురు కార్యవర్గ సభ్యులను నియమిస్తున్నట్లు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వాహక కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ తెలిపారు.
also read;-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని విమర్శించే స్థాయి కవిత కు లేదు
సోమవారం మల్లాపూర్ మండల కేంద్రం లోని సోమేశ్వర దేవాలయ పంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ రాజ్యాంగన్ని రక్షించుకోవడం, దళిత బహుజన ప్రజాసంఘాల అభివృద్ధే లక్ష్యం గా ముందుకు వెళ్లాలని ప్రావీణ్యం కలిగిన యువతను ఉత్తేజ పరుస్తు ప్రజాసంఘాలను బలోపేతం చేయాలని మహత్మ పూలే,అంబేద్కర్ ఆశయాల బాటలో కొనసాగలని పెర్కొన్నారు.
also read;-పంది దాడికి గురైన బడే బతుకయ్య……
ఈ సమావేశంలో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా నాయకులు బోనగిరి మల్లారెడ్డి, టిఏవైఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర రమేష్, నాయకులు సుతారి రాజేందర్, రుద్ర రాంప్రసాద్, మండ స్వామి, పెద్ది రెడ్డి లక్ష్మణ్, నాయిని అంజాగౌడ్,నవతే పుండరికం, మాడపతి ప్రమోద్, శనిగారపు రాజయ్య, వరిగడ్డి పెద్దలు, వుయ్యల లక్ష్మణ్,జాగర్ల రాజయ్య,నల్ల లక్పతి లు పాల్గొన్నారు