Telugu News

**రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కి TRS లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు పరామర్శ

ఖమ్మం విజయం న్యూస్)

0

****రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కి TRS లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు పరామర్శ
****(ఖమ్మం విజయం న్యూస్):-

రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే… కాగా ఆదివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం, పెద్దతండా లో సత్యవతి రాథోడ్ నివాసానికి వెళ్లిన TRS లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు  అక్కడ ఏర్పాటు చేసిన లింగ్యా నాయక్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

also read :-****బోనకల్ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గారు, జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , రాష్ట్ర నాయకులు మద్దినేని స్వర్ణకుమారి నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్ ,పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు