Telugu News

సత్తుపల్లిలో రాజకీయ బలప్రదర్శన

మంత్రి వర్సెస్ పొంగులేటి గా మారిన పర్యటన

0

సత్తుపల్లిలో రాజకీయ బలప్రదర్శన
== మంత్రి వర్సెస్ పొంగులేటి గా మారిన పర్యటన
== భారీ కార్ల ర్యాలీతో హాజరైనా మంత్రి పువ్వాడ
== 200 కార్లు, 500 మోటర్ సైకిల్స్ తో భారీ ర్యాలీ..
== అంతే దీటుగా భారీ ర్యాలీగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
== సత్తుపల్లిలో హాట్ టాఫిక్ గామారిన మోటర్ సైకిల్ ర్యాలీ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
సత్తుపల్లిలో ఎన్నికల స్టంటూ షూరు అయినట్లే కనిపిస్తోంది.. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలే బలనిరూపణ చేసుకుంటున్న సందర్భంలో ఒకరిపై ఒకరు బహిరంగ విమ్మర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు మోటర్ సైకిళ్ల ర్యాలీ, ప్రతి కార్యక్రమానికి జన సమీకరణతో బలప్రదర్శన నిర్వహించిన సంగతి పాఠకులందరు చూస్తున్నదే. అయితే శనివారం కూడా అదే పరిస్థితి సత్తుపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

also read;-మల్లు స్వరాజ్యం ఇక లేరు

అయితే అక్కడ కందాళ, తుమ్మల మధ్య బలప్రదర్శన నడుస్తుంటే, సత్తుపల్లి నియోజకవర్గంలో మాత్రం రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన పట్ల జరిగింది. వీరికి వర్గాలు లేవు కానీ అక్కడ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పొంగులేటి అనుచరుడు మట్టాదయానంద్ మధ్య పోటీ నెలకొన్నట్లు కనిపించింది. అయితే సత్తుపల్లి నియోజకవర్గ వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సంధర్భంగా మహిళా కబడ్డీ పోటీల విజేతలకు బహుమతుల ప్రధానానికి హజరైయ్యేందుకు వచ్చిన రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్వర్యంలో తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు.

also read;-కలియుగ అభయ ఆంజనేయుడే మా కందాళ ఉపేందర్ రెడ్డి 

500 మోటార్ సైకిల్, 200 కార్ల తో ర్యాలీగా హాజరైయ్యారు. భారీ ర్యాలీ ప్రదర్శనతో ఎంతో ఉత్సాహంతో కేరింతలు కొడుతు జై తెలంగాణ.. జై కేసీఅర్ అంటు నినాదాలు చేస్తు కదిలారు.. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సత్తుపల్లి నియోజకవర్గంలోని కందుకూరు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరు కాగా, సత్తుపల్లి నుంచి అభిమానులు, కార్యకర్తలు, పొంగులేటి అనుచరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సుమారు 200 కార్లు, 300 మోటర్ల సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. దీంతో సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుల ర్యాలీలో ప్రజలు అశ్ఛర్యపోయారు. ఎన్నికలు ఇప్పుడే వస్తున్నాయా అన్నట్లు మారింది సత్తుపల్లి నియోజకవర్గంలో నేతల ర్యాలీ పరిస్థితి. అయితే రెండు బ్యాచ్ లుగా విడిపోయి కార్యక్రమాలు చేస్తుండటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకింతగా ఆశ్చర్యపడిపోయారు. మొత్తానికి సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా సండ్ర వర్సెస్ మట్టా వార్ కొనసాగుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది.