జీళ్ళచెరువు వెంచర్ పై అధికారుల నజర్
** విజయం కథనానికి స్పందించి రాళ్లను తొలగించిన అధికారులు
(కూసుమంచి-విజయం న్యూస్);-
కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామ పంచాయతీలోని జీళ్ళచెరువు- కేశవాపురం గ్రామాల మధ్యలో కొన్ని అనుమతులు లేకుండా నూతనంగా వెంచర్ నిర్మానం చేశారు. కాగాఈ వెంచర్ కు అనుమతులు లేవని వెంచర్ పై “విజయం తెలుగు దిన పత్రికలో” “పంచాయతీ ల అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం.. పంచాయతీ ఆధాయానికి గండీ అంటూ వార్తను ప్రచురితం చేయడం జరిగింది.దీంతో ఈ కథనానికి జిల్లా, మండల పంచాయతీ అధికారులు స్పందించారు. కూసుమంచి ఎం పి ఓ రామచంద్రయ్య ఆధ్వర్యంలో లో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది కలిసి ఆ వెంచర్ ను పరిశీలించారూ.
also read :-వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. తెలంగాణలో ఎంతంటే..?
అనుమతులు లేకపోవడంతో వెంచర్ల వేసిన లేఅవుట్ రాళ్లను తక్షణమే జెసిబి సాయంతో తొలగించారు. అలాగేవెంచర్లో రహదారుల నిర్మాణం చేయగా వాటిని జెసిబి తో రోడ్లను చెరిపించారు.అనంతరం సంబంధిత యజమాని కి ఫోన్ చేసి వెంచర్ నిర్మాణానికి కచ్చితంగా పంచాయతీ అనుమతి తీసుకోవాలని, పంచాయతీకి ఇవ్వాల్సిన గ్రీన్ బెల్ట్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి పంచాయితీకి అప్పజెప్పాలని ఆదేశించారు..దీంతో విజయం ప్రతికకు పలువురు అభినంధనలు తెలిపారు. పంచాయతీ కి వచ్చే ఆధాయం కోసం విజయం లో వచ్చిన కథనం మంచి చేసిందని ప్రసంశించారు.