Telugu News

రామాపురం రామాలయ అభివృద్ధికి పొంగులేటి రూ.లక్ష విరాళం

బోనకల్: మండలంలోని రామాపురం గ్రామంలోని

0

రామాపురం రామాలయ అభివృద్ధికి పొంగులేటి రూ.లక్ష విరాళం

—బోనకల్: మండలంలోని రామాపురం గ్రామంలోని

 

—శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధి నిమిత్తం తెరాస రాష్ట్ర నాయకులు,

—(రామాపురం విజయం న్యూస్):-

ఖమ్మంమాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి రూ. లక్షను ఆలయ కమిటీ నిర్వాహక బాధ్యులకు అందజేశారు. గత ఏడాది కార్తీకమాసోత్సవా వేడుకల్లో పొంగులేటి ఆలయ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారికి ఆనాడు ఇచ్చిన మాట మేరకు ఈ మొత్తాన్ని సోమవారం ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గ్రామ సర్పంచ్ తొండపు వేణు సమక్షంలో అందజేశారు. భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేస్తానని హామీ ఇచ్చారు.

also read :-గ్రామీణ వైద్యుల సమస్యకు త్వరలోనే పూర్తి స్థాయి పరిష్కారం.. మంత్రి పువ్వాడ.

ఈ కార్యక్రమంలో రాపల్లి సర్పంచ్ మందడపు తిరుమలరావు, తెరాస నాయకులు ఉమ్మినేని కృష్ణ, తొండపు వాసు, గుడిపూడి రామకృష్ణ, ఆలయ ఛైర్మన్ బంధం అచ్చయ్య, దుగ్గిబోయిన నాగయ్య, మంద హనుమంతరావు, మంద నారాయణ, బంధం ఉప్పలయ్య, మామిళ్ళ రామారావు, ఆలయ ప్రధాన అర్చకులు రాళ్ళబండి శ్రీనివాస శర్మ, తమ్మారపు బ్రహ్మం, కొరివి సురేష్ తదితరులు పాల్గొన్నారు.మండల స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన పొంగులేటి ఖమ్మం రూరల్: మండలంలోని సాయిప్రభాత్ నగర్, పెద్దతండాలో పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండలస్థాయి క్రికెట్ పోటీలను తెరాస రాష్ట్ర నాయకులు, మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రారంభించారు.

also read :-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

ప్రతి ఒక్కరిలోనూ క్రీడా స్ఫూర్తి కలిగింపజేసేందుకు ప్రతిఏడాది క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న టీఆర్ఎస్ యువజన నాయకులు అజ్మీరా అశోక్ నాయక్ ను, జలగం నగర్ యూత్ బాధ్యులు ఏర్పుల నరేష్ యాదవ్, కొమ్ము సుమంత్, నల్లగట్ల అన్వేష్ ను ఈ సందర్భంగా పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి వెంట జిల్లా నాయకులు సర్పంచ్ భుజంగరెడ్డి, మాజీ కార్పొరేటర్ ధరవత్ రామ్మూర్తి నాయక్, ఒరడీ విజయ్ రెడ్డి, 7 ఆర్ట్స్ సిద్ధు, బాణోత్ పాప్య, బాణోత్ సురేష్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కార్పొరేటర్ దొడ్డా నగేష్, కొప్పెర ఉపేందర్, దుంపల రవి కుమార్, కానుగుల రాధాకృష్ణ, చెల్లా రామకృష్ణారెడ్డి, కనగంటి రావు, చింతమళ్ల గురుమూర్తి, మొగిలిచర్ల సైదులు, కాంపాటి రమేష్ తదితరులు పాల్గొంటారు

also read :-పినపాక పై ఎందుకు గురి..?

నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మం : నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన నరపునేనిపల్లి వెంకట్రామిరెడ్డి కుమార్తె వివాహ నిశితార్థ వేడుకకు తెరాస రాష్ట్ర నాయకులు, మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి వెంట మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కార్పొరేటర్ దొడ్డా నగేష్, కొప్పెర ఉపేందర్, కొణిజర్ల మండల నాయకులు కోసూరి శ్రీను, దుంపల రవి కుమార్, కానుగుల రాధాకృష్ణ, చెల్లా రామకృష్ణారెడ్డి, కనగంటి రావు, చింతమళ్ల గురుమూర్తి, మొగిలిచర్ల సైదులు, కాంపాటి రమేష్, శేఖర్ రెడ్డి, శీలం కృష్ణారెడ్డి, గుండ్ల కోటి, శీలం రామకృష్ణారెడ్డి, పుల్లారెడ్డి, నర్సింహారావు తదితరులు పాల్గొంటారు.

గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పొంగులేటి
మధిర: మండలంలోని సిరిపురం గ్రామంలో సీతారామచంద్రస్వామి గుడి ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటిని ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కారించారు. అనంతరం పలు ప్రయివేటు కార్యక్రమాల్లో పొంగులేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కోట రాంబాబు, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, చిద్రాల వెంకటేశ్వర్లు, దేవిశెట్టి రంగారావు, యన్నం కోటేశ్వరరావు, కటికల సీతారామిరెడ్డి, చావల రామరాజు, భాగం నాగేశ్వరరావు, మొండితోక సుధాకర్, చెరుకూరి నాగార్జున్, బండి వెంకటేశ్వర్లు, దుంపా వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ కనకపుడి పెద్ద బుచ్చయ్య, కనకపుడి సులేమాన్, అక్కినపల్లి నాగేశ్వరరావు, కంభంపాటి సురేష్, ప్రశాంత్, టీఆర్ఎస్ వీ లక్ష్మారెడ్డి, సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.