Telugu News

తాపీ మేస్త్రీల సంఘం భవన నిర్మాణానికి పొంగులేటి రూ.లక్ష విరాళం

ఖమ్మం  -విజయంన్యూస్

0

తాపీ మేస్త్రీల సంఘం భవన నిర్మాణానికి పొంగులేటి రూ.లక్ష విరాళం

(ఖమ్మం  -విజయం న్యూస్):-

ఖమ్మం నగర, అర్బన్, రూరల్ తాపీ మేస్త్రీల వెల్ఫేర్ సొసైటీ యూనియన్ భవన నిర్మాణానికి తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.లక్షను విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సంఘం నాయకులకు అందించారు. సంఘం బలోపేతానికి, సంఘం కార్యక్రమాలకు సభలు, సమావేశాలను నిర్వహించుకునేందుకు వీలుగాను తమకంటూ ఓ భవనం ఉ ండాలని భావించి త్రీటౌన్లో ఓ భవానాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో తాపీ మేస్త్రీల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు ఆర్థికసాయం చేసినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు, వైరా మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, తాపీ మేస్త్రీల సంఘం నాయకులు అనిశెట్టి శంకరయ్య, గుడిపాటి ముత్యాలు, తొట్టె యల్లయ్య, కుమ్మరికుంట్ల వెంకటనారాయణ, సుంకర వెంకటనారాయణ, గుడిపాటి నాగేశ్వరరావు, తొట్టె యాదగిరి, అశోక్, ఎస్ కె. దసాగిరి తదితరులు పాల్గొన్నారు.

also read :-ఉలిక్కిపడిన అమెరికా..ఎందుకోసమంటే..

మద్దుకూరు బొడ్రాయి ప్రతిష్ఠకు పొంగులేటి రూ.50వేల విరాళం

చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలోని మద్దుకూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న బొడ్రాయి ప్రతిష్ఠకు తెరాస రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ. 50వేలను విరాళంగా అందజేశారు. గ్రామంలోని రామాలయంలో బొడ్రాయి ప్రతిష్ఠకు గాను స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఆర్థికసాయం చేసినట్లు పొంగులేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, భోజ్యా నాయక్, సారేపల్లి శేఖర్, నల్లమోతు అంజిబాబు, నెల్లూరి ప్రసాద్, సుండ్రు విజయ్ బాబు, నల్లమోతు రమణ, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.