Telugu News

పొంగులేటి మరో సంచలన ప్రకటన

== పదవులు శాశ్వతం కాదు.. మంచితనమే శాశ్వతం

0

పొంగులేటి మరో సంచలన ప్రకటన

== పదవులు శాశ్వతం కాదు.. మంచితనమే శాశ్వతం

== పెద్ద పెద్ద పదవులు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు

== ప్రజలందరు శీనన్న అని ప్రేమతో పిలుస్తారు

== అంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి

== వైరా పర్యటనలో సంచలన ప్రకటన చేసిన పొంగులేటి

(వైరా/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్);-

ఈ మధ్య హాట్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ప్రతి పర్యటనలో ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ అబిమానులకు నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. మంగళవారం బూర్గంపాడు మండలంలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా పోటీ చేసేది చేసేదేనని, తగ్గేదేలేదన్నారు. అలాగే బుధవారం వైరా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మరో హాట్ కామెంట్స్ చేశారు. పదవులు అనేవి శాశ్వతం కాదని, పదవుల్లో ఉన్నంత మాత్రానా చాలా పెద్దవారు అయిపోరని, పదవులు తాత్కాలికమేని అన్నారు. పుట్టిన ప్రతి మనిషికి ఎప్పుడూ పదవుల్లోనే ఉండరని, అవే పదవులు శాశ్వతం కావన్నారు.

also read :-డాక్టరేట్ పట్టా పొందిన సిస్టర్ విజయ ప్రభావతి…

శాశ్వతం అని ఎవరైనా అనుకుంటే అది పగటి కలలు కన్నట్లే అని వ్యాఖ్యానించారు. ప్రజలు శాశ్వతమని, ప్రజలకు సేవ చేయడం శాశ్వతం కావాలన్నారు. ఎంతోమంది మహానీయులు, సీఎం, పీఎంలుగా, మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించి కాలగర్భంలో కలిసిపోయారని, కానీ ప్రజల కోసం పాటు పడినవారే ప్రజల గుండెల్లో నిలిచిపోతారని చెప్పారు. చనిపోయినా, పదవినుంచి దిగిపోయినా, ఏ పదవీ లేకున్నా ప్రజల మనసుల్లో స్థానం ఉన్నవాళ్లకే మళ్లీ అవకాశం ఉంటుందన్నారు. ఏ పదవి లేకున్నా ప్రజలమధ్యకు వెళ్తుంటే చాలా సంతోషంగా ఉందని, ప్రజలు చూపిస్తున్న అభిమానం మాటల్లో వర్ణించలేనిదన్నారు. ప్రజలందరు శీనన్న అని అప్యాయంగా పిలుస్తుంటే మనసు పులకించిపోతుందని, ఎన్ని కోట్లు పెట్టిన అంత అప్యాయత రాదని అన్నారు. స్వాతంత్రం వచ్చి ఐదు దశాబ్దాలు దాటినా.. నేటికీ తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో పూరి గుడిసెల్లో పేదవాళ్ల ఉన్నమాట వాస్తవమే అని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు పేదల సంక్షేమం కోసం పని చేయాలని, అప్పుడు వారికి న్యాయం జరుగుతుందన్నారు.

also read ;-సామాజిక చైతన్యం కోసం మహనీయుల జీవిత చరిత్ర చదవడమే మార్గం .
== అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హాజరుకాని టీఆర్ఎస్ నేతలు
వైరాలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు చోట్ల అంబెద్కర్ విగ్రహాన్ని అవిష్కరించారు. అయితే ఈ విగ్రహ అవిష్కరణ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు హాజరుకాలేదు. పొంగులేట టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికి, స్థానిక ఎమ్మెల్యే, చైర్మన్లు టీఆర్ఎస్ పార్టీవారే అయినప్పటికి ఏ ఒక్కరు కూడా హాజరుకాలేదు. అయితే అందులో ట్విస్ట్ మాత్రం ఉంది. విగ్రహావిష్కరణలకు రెండు చోట్ల కాంగ్రెస్ నాయకులు హాజరు కావడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోమవారంలో విగ్రహ ఆవిష్కరణలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువాళ్ల దుర్గాప్రసాద్, మూడో వార్డులోని విగ్రహావిష్కరణకు పీసీసీ సెక్రటరీ కట్ల రంగారావు హాజరవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే అది సాధాహరణంగానే జరిగినప్పటికి రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది హాట్ టాఫిక్ గానే మారిందని చెప్పాలి. ఒక వైపు పొంగులేటి వ్యాఖ్యలు, మరో వైపు టీఆర్ఎస్ నేతలు హాజరు కాకుండా ఉండటం, కాంగ్రెస్ వారితో విగ్రహావిష్కరణలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందా..? లేదంటే ప్రజాబలం చూపించేందుకు కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్తున్నారా..? అనే విషయంపై సర్వత్ర చర్చ జరుగుతుంది. మొత్తానికి వైరాలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.