Telugu News

పాలేరు కు పొంగులేటి

కొత్తగూడెం టిక్కెట్  అశించిన మాజీ ఎంపీ..?

0

పాలేరు కు పొంగులేటి

== కొత్తగూడెం టిక్కెట్  అశించిన మాజీ ఎంపీ..?

== సర్వేలో పాలేరు వైపు ప్రజలు మొగ్గు

== ప్రజల్లో ఉంటారని తెల్చిన నియోజకవర్గ ఓటర్లు

== పాలేరులో పొంగులేటి 68శాతం ఫలితం రావడంతో అధిష్టాన నిర్ణయం

== ప్రయత్నాల్లో నిమగ్నమైన పొంగులేటి వర్గం

                మూడు నియోజకవర్గాలపై గురి పెట్టారు.. మూడింటిలో దరఖాస్తులు చేశారు.. ఎక్కడ ఇచ్చిన గెలుపు తథ్యమన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. కానీ ఓటర్ల మాత్రం ఆయన్ను పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తేనే బాగుంటుందని..గెలుపు తథ్యమని భావిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వే రిపోర్టులో ఇదే చెబుతోంది.. మూడు జనరల్ స్థానాలపై పార్టీ సర్వే చేయించగా, పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి పోటీ చేస్తే మంచిదనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది.. పాలేరులో మెజారిటీ ఓటింగ్ వచ్చినట్లుగా తేలింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సీట్ల మార్పిడిని షూరు చేసింది..

ఇది కూడా చదవండి:- తుమ్మల “ఖమ్మం” లో పోటీ..?

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం నియోజకవర్గానికి సిప్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ అదిష్టానం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పాలేరుకు పంపించేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.. కానీ పొంగులేటి మాత్రం ఖమ్మం, పాలేరు కంటే కొత్తగూడెం నియోజకవర్గమైతే సెఫ్  అని, ఇక్కడ పోటీ చేసి రాష్ట్రం మొత్తం ప్రచారం కోసం తిరిగిన ఎలాంటి ఇబ్బంది లేదని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు కా..? కొత్తగూడెంకా..? అనే విషయంపై ‘విజయం’ తెలుగుదినపత్రిక అందించే రాజకీయ విశ్లేషణాత్మక కథనం మీ కోసం..

(కూసుమంచి-విజయంన్యూస్)

కాంగ్రెస్ కంచుకోట పాలేరు నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టిక్కెట్ తెచ్చుకుంటే చాలు.. కచ్చితంగా విజయం ఖాయమే.. అలాంటి పాలేరు నియోజకవర్గాన్ని ఎవరైనా వదులుకుంటారా..? అందుకనే ఆ నియోజకవర్గంపై అందరి కండ్లు పడ్డాయి.. చోటా నాయకత్వం నుంచి బడా నాయకత్వం వరకు పాలేరు నుంచి పోటీ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు.. అంతే కాదు.. పార్టీలు మారే వారు కూడా పాలేరు నియోజకవర్గంపై గురిపెడుతున్నారు..?

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్‌కు అధికారం ఖాయం: సోనియా

అక్కడ హస్తం గుర్తుపై పోటీ చేస్తే అసెంబ్లీకి పోవుడు ఖాయం అనుకుంటూ నేతలు.. పాలేరు టిక్కెట్ కావాలని ఆశపడుతున్నారు.. అందుకే కాంగ్రెస్ పార్టీని కష్టాల్లో కాపాడిన వారితో పాటు పదవులు రాక పార్టీలు మారుతున్న  పక్క పార్టీ నాయకులు సైతం పాలేరు నియోజకవర్గం టిక్కెట్ ను ఆశించి పార్టీలు మారుతున్నారు.. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో అదే జరుగుతుంది..

జనరల్ స్థానమైన పాలేరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి  పోటీ చేసేందుకు మొత్తం 12 మంది ఆశావాహులు  దరఖాస్తు చేసుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి సోదరుడు కుమారుడు, యువజన నాయకుడు రాంరెడ్డి చరణ్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి, మహిళా రాష్ట్ర నాయకురాలు రామసహాయం మాదవిరెడ్డి, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తిరుమలాయపాలెం జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్,పీసీసీ కార్యదర్శి, బీసీ నాయకులు ఎడ్ల శ్రీరామ్ యాదవ్, నాయకులు బైరి హరినాథ్ రెడ్డి, తల్లంపాడు సర్పంచ్  శివశంకర్ రెడ్డి, నాయుడు సత్యనారాయణ, సభావత్ రాములు దరఖాస్తు చేయగా, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గీయులు డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి దరఖాస్తులు చేశారు.  కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ పదేళ్ల పాటు టిక్కెట్ ఆశించి భంగపడుతూ, అయినప్పటికి  పార్టీ కార్యకర్తలను కాపాడిన రాయల నాగేశ్వరరావు, రాంరెడ్డి చరణ్ రెడ్డి, మద్దిశ్రీనివాస్ రెడ్డి, మాదవిరెడ్డిలు  పార్టీని నమ్ముకుని ఉన్నారు. వారిలో ఎవరికో ఒకరికి పాలేరు టిక్కెట్ వస్తుందని వారు ఆశించారు.

ఇది కూడా చదవండి:- విజయభేరి సభలో జోస్యం చెప్పిన రాహుల్

కానీ ప్యారషూట్ లా పార్టీలు మారుతున్న నేతలకు అవకాశాలు దక్కుతుండటం గమనర్హం.. ఇప్పుడే కాదు.. 2009 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు,ఎడ్ల శ్రీరామ్ యాదవ్, రామసహాయం నరేష్ రెడ్డి, మద్ది  శ్రీనివాస్ రెడ్డి పాలేరు టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. పడుతూనే ఉన్నారు. ఆ ముగ్గురు పార్టీ కార్యకర్తలను నమ్ముకుని పనిచేశారు.. కానీ 2009, 14లో రాంరెడ్డి వెంకట్ రెడ్డికి టిక్కెట్  ఇచ్చారు. 2018లో  ఎన్నికలకు 17రోజుల ముందు కందాళ ఉపేందర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. 17 రోజుల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఇది కార్యకర్తల ఘనత.. అయితే ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల శ్రీరామ్ యాదవ్, బెల్లం శ్రీనివాస్, లతో పాటు పార్టీ మారిన నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మువ్వా విజయ్ బాబు, మద్దినేని బేబి స్వర్ణ కుమారి  పోటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

== పాలేరు టిక్కెట్.. పొంగులేటికేనా..?

పాలేరు నియోజకవర్గంలో మొత్తం 12 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోగా, అసలు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నఫలంగా తెరపైకి వచ్చిన నేత  తుమ్మల నాగేశ్వరరావు. ఆయన పార్టీలో చేరడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి..

ఇది కూడా చదవండి:- నరేంద్రమోడీని ప్రశ్నిస్తే కేసులే: రాహుల్

బీఆర్ఎస్ పార్టీ నుంచి పాలేరు టిక్కెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తన బల నిరూపణ చేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. జిల్లాకు చేరిన మొదటి రోజున జరిగిన మీడియా సమావేశంలో  కచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు సోనియాగాంధీ, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  దీంతో పాలేరు నియోజకవర్గ టిక్కెట్ తనకే కేటాయించాలని కోరారు. అయితే కాంగ్రెస్ సర్వేలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎక్కువ ఓటింగ్ వస్తుండటంతో తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం పంపించి,పొంగులేటిని పాలేరులో పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వేలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గెలుపు అవకాశాలు పాలేరులో ఎక్కువగా ఉన్నట్లు తెలిందనే ప్రచారం జరుగుతోంది. పాలేరు నియోజకవర్గంలో 68శాతం గెలుపు అవకాశాలున్నట్లు సర్వేలో రాగా, కొత్తగూడెంలో 59శాతం, ఖమ్మంలో48శాతం గెలుపు అవకాశాలు ఉన్నట్లు  ప్రజలు ఓటింగ్ వేసినట్లుగా రిపోర్ట్ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇది కూడా చదవండి:- బీజేపీ, బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీల ఆత్మ ఒక్కటే: రాహుల్

ఇటీవలే కొందరు ప్రైవేట్ సర్వేలో కూడా పొంగులేటికి పాలేరు నుంచి ఎక్కువ శాతం ప్రజలు పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పొంగులేటిని పాలేరులో పోటీ చేయించే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది..

== కొత్తగూడెంపై కన్నేసిన పొంగులేటి..?

ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని భావించారు. ఎందుకంటే ఎన్నికల కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న పొంగులేటి రాష్ట్రం మొత్తం ప్రచారం కోసం తిరగాల్సి ఉంటుంది. అందుకే కాంగ్రెస్ కు కంచుకోట కావడం, స్థానిక ఎమ్మెల్యే వనమాపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, పొంగులేటికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో కొత్తగూడెంలో పోటీ చేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించోచ్చు అనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పొంగులేటి కి సర్వేలో మాత్రం పాలేరులో పోటీ చేస్తేనే భాగుంటుందని తెలినట్లు సమాచారం. అయితే ఆయన కాకుండా ఎవరు పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డికి పోటీ ఇవ్వలేరని, తుమ్మల నాగేశ్వరరావు అయితే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని, రాయల నాగేశ్వరరావు అయితే టఫ్ ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో తెలినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇది కూడా చదవండి:- ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: రాహుల్

రాయల నాగేశ్వరరావు పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నందునా కొంత పార్టీ కార్యకర్తలో సానుభూతి వస్తుందని, ప్రజల్లో మంచి మనిషి అనే భావన ఉంటుందని ప్రజలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా తుమ్మల నాగేశ్వరరావుకు అహం ఎక్కువ ఉంటుందని, సామాన్యులు తుమ్మల వద్దకు వెళ్లలేరని, అభివద్ది మాత్రం ఎనలేని అభివద్ది జరుగుతుందని ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన 5ఏళ్ల కాలంలో పాలేరు అభివద్దిలో వెనకబడిపోయిందని, తుమ్మల వస్తే భాగుంటుంది కానీ, ఆయన సామాన్యులను దరికి రానీవ్వరు అనే ఆలోచన ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యర్థి బాగా జనంలోకి వెళ్లడం, రూ.10వేలతో పాటు ప్రజలతో మమైకమై, సామాన్యులను సైత అప్యాయత పలకరించే స్వభావం కల్గిన కందాళపై పోటీ చేసే వారు కచ్చితంగా మాస్ లీడర్ అయ్యి ఉండాలని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

== పాలేరులో పర్యటిస్తున్న పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయం ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో ప్రచారం షూరు చేశారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో పర్యటించిన ఆయన అతి కొద్ది రోజుల్లోనే ప్రచారం ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి..

ఇదీ కూడా చదవండి:- కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల

ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో క్యాంఫ్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, త్వరలోనే వాటిని ఓపెన్ చేసే అవకాశాలున్నాయి. మొత్తంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తారా..? కొత్తగూడెం ఎంచుకుంటారా..? వేచిచూడాల్సిందే మరీ..?