Telugu News

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

బెల్లంపల్లి - విజయం న్యూస్

0

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

(బెల్లంపల్లి – విజయం న్యూస్);-

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ స్థానిక పాత బస్టాండ్ లోని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమనికి జిల్లా ప్రధాన కార్యదర్శ మునిమంద రమేష్ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత సభ్యత్వం బిజెపి పార్టీకి ఉందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

also read ;-ఢిల్లీకి చేరిన తెలంగాణా పంచాయతీ.

అనంతరం పట్టణ పుర వీధుల గుండా బారి బైక్ ర్యాలీ తీశారు. పట్టణంలోని బూత్ లలో బూత్ అధ్యక్షులు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ పదాధికారులు, జిల్లా పదాది కారులు, వివిధ మోర్చాల పదాధికారులు, సీనియర్ నాయకులు, భూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, శక్తి కేంద్ర ఇంచార్జ్ లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.