పువ్వాడ అంటే ప్లవర్ కాదు..ఫైర్ : మంత్రి పువ్వాడ
== దమ్ముంటే చాలెంజ్ కు రా..? నీ చేతనైంది చేసుకో
== గవర్నర్ కు ఫిర్యాదు చేసి ఏం పీకినవ్.. నేను ఏ విచారణకైనా సిద్దం
== సుపారి పీసీసీ వి నువ్వు.. నా గురించి మాట్లాడే హక్కే లేదు
== మేము భూమి పుత్రులం.. సుపారి పుత్రులం కాదు
== పబ్బులు, క్లబుల చరిత్ర రేణుక చౌదరిది
== టిక్కెట్లు అమ్ముకుని మనుషులను చంపింది నువ్వుకాదా?
== కాంగ్రెస్ చచ్చిన పార్టీ..
== ఖమ్మం ఖిల్లా టీఆర్ఎస్ జిల్లా
== విలేకర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి, రేణుక చౌదరిపై మండిపడిన మంత్రి పువ్వాడ
== రైతుల గురించే మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు, రేవంత్ కు లేదు : కొప్పుల ఈశ్వర్
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-
పువ్వాడ అంటే ప్లవర్ అనుకుంటివా..? కాదు ఫైర్.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే చాలెంజ్ కు రావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రేవంత్ రెడ్డికి సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఖమ్మం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సాంఘీకసంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. 2018 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మీడియా సమక్షంలో అన్నారని, అది గుర్తు చేస్తున్నానంటూ వీడియో తీసి చూపించారు. ఆయన నన్ను ప్రశ్నించే ముందు ఆయన చేసిన వ్యాఖ్యలకు కట్టు బడి ఉండాలని సూచించారు.
also read;-జీళ్ళచెరువు లో జెండా అవిష్కరణ చేసిన రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి సుపారి పీసీసీ అధ్యక్షుడని, నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు. ఖమ్మం జిల్లాకు రెండు ఐటెమ్స్ వచ్చాయని, ఒక్కటి సుపారీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరోకరు సీట్లు కోసం పైసలు తీసుకుని గిరిజనుడ్ని బలిచేసిన పైసా వసూళ్ల నాయకురాలు రేణుక చౌదరి అని ఆరోపించారు. సినిమాలో ఐటెమ్ సాంగ్స్ వస్తే ఎలా సందడిగా ఉంటుందో.. అదే తరహాలో చెంగచెంగ ఎగిరి వెళ్లిపోయాయని అన్నారు. మెడికల్ కాలేజీపై రేవంత్ రెడ్డి చాలెంజ్ చేసి విషయంపై నేను చాలెంజ్ చేస్తున్నానని, నీకు దమ్ముకుంటే ఏ విచారణకైనా వేసుకో అని అన్నారు. గతంలోనే నేను చెప్పానని ఏ విచారణకైనా సిద్దంగా ఉన్నానని, తప్పు చేస్తే పదవిని సరెండర్ చేస్తానని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. నా చాలెంజ్ ను వదిలేసి ఇంకోక్కటేంటో ఎత్తుకోవడం రేవంత్ రెడ్డి వెనకడుగు వేయడానికి నిదర్శనమన్నారు. మెడికల్ కాలేజీపై గవర్నర్ కు లేఖ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏం పీకాడో చెప్పాలని అన్నారు. నీకు చేతనైంది చేసుకో, సీబీఐ వేసుకుంటావో, ఇంకే సంస్థతోనైనా విచారణ చేయించుకుంటావో..? నీఇష్టమన్నారు.
also read;-జితేందర్ రెడ్డి సేవలు మరవలేనివి
తప్పు తేలకపోతే పీసీస ఊడబిక్కోని రాజకీయాలకు దూరంగా ఉండాలని సవాల్ చేశారు. పువ్వాడ కుటుంబం చాలా గ్రౌండ్ నుంచి వచ్చిందని, పోరాటల నుంచి రైతాంగ సాయుద పోరాటాల కుటుంబాల నుంచి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు వందమందిని తెచ్చుకున్న నేను సిద్దంగా ఉన్నానని అన్నారు. రేవంత్ రెడ్డి ఖమ్మం వచ్చింది రాహుల్ సభ కోసం అయితే, వచ్చిన పని వదిలేసి పువ్వాడ నామస్మరణనే ఎక్కువ చేశారని అన్నారు. ఖమ్మం నగరంలో మమత కళాశాల 25 ఏళ్ళ ప్రతిష్టాత్మకమైన కళాశాల.. ఎంతో పారదర్శకంగా నడుస్తున్న కళాశాల.. రా చూస్కో ఏం చూసుకుంటావో చూస్కో.. ఎం చేసుకుంటావో చేస్కో.. దగ్గరుండి చూపించే పంపుతా.. నీకు దమ్ముందా..? అంటూ పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ చేశారు. పాలకుడు శక్తి మంతుడు అయినప్పుడు శత్రువులు అంతా ఏకమై వస్తారు అన్న చాణక్యుడు నీతి నీ గుర్తు చేశారు. ఖమ్మం నగరంలో జరిగిన చిన్న సమస్యను పట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ దోస్తి పార్టీలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకులు ఖమ్మంలో తిష్టవేసి అనరాని అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టామని చెబుతున్న రేవంత్ రెడ్డికి తెలియదనుకుంటా..?
also read;-రఘునాథపాలెం మండల టిఆర్ఎస్ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం
కాంగ్రెస్ హాయంలోనే ఒకడిపై 2013లో ఒకడిపై రౌడీ షీటు, 2018లో మరోకరిపై రౌడీ సీటు కేసు నమోదైందన్నారు. రేణుక చౌదరి ముస్తాఫాపై మొదటి రౌడీ షీట్ కేసును నమోదు చేయించారని, ఆ విషయం మర్చిపోవద్దన్నారు. కాంగ్రెస్ హాయంలో తెలంగాణ ఉధ్మకారులపై అనేక కేసులు పెట్టారని, జైలుకు పంపించారని, జై తెలంగాణ అంటే జైలుకు పంపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీలు తీసుకుని పరుగెత్తిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల గురించి, కాంగ్రెస్ పార్టీకి కేసులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మేము గిరి, భూమి పుత్రులమని, సుపారి పుత్రలం కాదని హెద్దేవా చేశారు.
== సీట్లమ్ముకునే రేణుక..ఖమ్మంకు తట్టెడు మట్టైన పోసిందా.??
ఎన్టీఆర్ తనను నమ్మ టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే ఎన్టీ రామారావు డొక్కలో పొడిచి ఛీకొట్టి కాంగ్రెస్ లో వెళ్లిన రేణుక చౌదరి, కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పేరుతో అమాయక గిరిజనులను పొట్టన పెట్టుకుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దుయ్యబట్టారు. టిక్కెట్ ఇస్తామని చెప్పి గిరిజన నాయకుడు రాంజీని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన రేణుక చౌదరి, నీతికి, నిజాయితీకి నిలువుటద్దమైన పువ్వాడ కుటుంబాన్ని విమ్మర్శించే హక్కు లేదన్నారు. 2దశల్లో వచ్చిన కరోనా కుడా పోయింది కానీ రేణుక అనే దరిద్రం ఇంకా ఖమ్మం నుండి పోలేదని, ఏం కర్మ ఇది అని ఆయన విమ్మర్శించారు. కేసుల గురించి మాట్లాడుతుంది రేణుక.. మా తెరాస ఉద్యమ నాయకులపై ఎంత మంది మీద పెట్టావు నువ్వు కేసులు.. గుర్తులేదా..?అని ప్రశ్నించారు.
also read;-ఇరవండి గ్రామంలో రైతు గోస దీక్ష లో పాల్గొన్న వైఎస్ షర్మిల
20 సంవత్సరాలు ఖమ్మంలో ప్రజాప్రతినిధిగా ఉన్నావు.. ఏం చేశావో చెప్పు.. తట్టెడు మట్టి పోయలే. ఒక్క పని చెయ్యలే.. కేవలం పదవిని అనుభవించి విలాసాలు అనుభవించావని ఆరోపించారు. నోట్ల కోసం సీట్లు అమ్ముకున్నావు.. సీట్లు ఇస్తా ఆని డబ్బులు దండుకుని గిరిజన డాక్టర్ రంజీ ప్రాణాలను బలిగోన్నవు.. నీకు సిగ్గుందా అసలు అంటూ దుయ్యబట్టారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పాల్వంచలో ఎకరాలకు ఎకరాలు కబ్జా చేశావని ఆరోపించారు. ఎవరికి తెలియదు నీ బాగోతం.. నీ బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పెడితే కానీ శాంతించవు అంటూ పేర్కొన్నారు. మాకు సంస్కారం ఉంది, చదువుకున్నాం.. విజ్ఞత ఉంది. నువ్వు మహిళ వు కాబట్టి ఎక్కువ మాట్లాడటం లేదు.. లేదంటే నీకు ఎలా బుద్ధి చెప్పాలో.. ఎక్కడ చెప్పాలో మాకు బాగా తెలుసన్నారు. పబ్ లు, క్లబ్ ల చరిత్ర నీదని అన్నారు.
also read;-ములుగు జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాంత్
పువ్వాడ సంగతి చూస్తావా..? ఏం చూస్తావు నా సంగతి అంటూ హెచ్చరించారు. ఇప్పటి రెండు సార్లు డిపాజిట్ రాకుండా తరిమిన సంగతి మర్చిపోవద్దన్నారు. మళ్లీ రా .. తిరిగి అదే గిప్ట్ ఇచ్చి పంపించేందుకు ఖమ్మం ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఇప్పుడు చెబుతున్న మీరిద్దరు రాసుకోవాలని, ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పుడు మాటలు మానుకోవాలని సూచించారు.
== రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు: కొప్పుల
తెలంగాణ రాష్ట్ర రైతుల గురించి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి లేదని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. రేవంత్ రెడ్డి మొత్తం అబద్దాలు అడుతున్నారని, వడ్లు కొనుగోలు చేయనందుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మీడియా ముందు తప్పుడు కూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక స్కీమ్ లు పెట్టిందన్నారు. అసలు వడ్లు కొనాల్సింది ఏ ప్రభుత్వమో రేవంత్ రెడ్డికి తెలుసా అని అన్నారు. కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయకపోయినప్పటికి, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నప్పటికి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతులను ఇబ్బందులకు గురి చేయోద్దనే ఆలోచనతో చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6,600 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు.
also read;-టీఆర్ఎస్ ను భూస్తాపితం చేస్తాం
చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదని, బీజేపీకి కాంగ్రెస్ కు ఉన్న సంబంధం ఏంటని..? ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ చికటీ దోస్తులని అన్నారు. అందుకు హుజురాబాద్ ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. హుజురబాద్ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మకై ఓట్లన్నింటిని అమ్ముకున్నావని, పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టావని, అందుకే పీసీసీ అధ్యక్షుడిగా నువ్వు పూర్తిగా అర్హత కోల్పోయావని అన్నారు. రైతుల పక్షాన నిలిచిన ఏకైక సర్కార్ తెలంగాణ సర్కార్ అని కొనియాడారు.
కాంగ్రెస్ కు దమ్ముంటే వాళ్లు పాలించే రాష్ట్రాల్లో రైతు బంధు పథకాన్ని అమలు చేసే దమ్ముందా..? అని ప్రశ్నించారు. రైతు బంధు పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకుంటున్న రైతుబంధువు సీఎం కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పతనం దిశగా అడుగులేసిందని, ఇక లేచే పరిస్థితుల్లో కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతామధుసూధన్ రావు, ఎమ్మెల్యే రాములు నాయక్, ఖమ్మం మేయర్, సుడా చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు హాజరైయ్యారు.