పాలేరు టిక్కెట్ కోసం రాయల దరఖాస్తు
== నేడు గాంధీభవన్ లో పార్టీ శ్రేణులు సమక్షంలో దరఖాస్తు == కూసుమంచి నుంచి హైదరాబాద్ కు రాయల భారీ ర్యాలీ
(కూసుమంచి -విజయం న్యూస్)
పాలేరు నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశిస్తున్న పాలేరు నియోజకవర్గ పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు తనకు టిక్కెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం 6గంటలకు కూసుమంచి నుంచి భారీ కార్ల ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నడుమ ఆయన గాంధీభవన్ కు వెళ్లి దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. వందలాధి మంది కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లనున్నారు. ముందుగా అవును అవును ఖమ్మం రూరల్ మండలం లోని అరుపులు మారెమ్మ గుడిలో పూజలు చేసి అక్కడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.
ఇది కూడా చదవండి:- జలగం దారేటు..?