Telugu News

రికార్డులను స్వాధీనపరుచుకున్న డీఎల్పీవో

అనంతగిరి- విజయం న్యూస్

0

రికార్డులను స్వాధీనపరుచుకున్న డీఎల్పీవో

(అనంతగిరి- విజయం న్యూస్)

అనంతగిరి మండల పరిధిలోని బొజ్జ గూడెం తండ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ రాములు గ్రామపంచాయతీ రికార్డులను స్వాధీనపరుచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని నిధులు దుర్వినియోగం అయ్యాయని గ్రామ ఉపసర్పంచ్ మండాన్ హరి ప్రసాద్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఈ విషయమై విచారణ చేపట్టామని తెలిపారు రికార్డులు పరిశీలించి నివేదికను పై అధికారులకు సమర్పిస్తామని తెలియజేశారు