Telugu News

మూకమ్మడిగా పార్టీకి రాజీనామా

*నియోజకవర్గం లొని టి.అర్.ఎస్ పురిటి గడ్డలొనే ముసలం

0

*మూకమ్మడిగా పార్టీకి రాజీనామా
*నియోజకవర్గం లొని టి.అర్.ఎస్ పురిటి గడ్డలొనే ముసలం
*నిలదీస్తున్న కార్యకర్తలు
(శివకుమార్, అశ్వారావుపేట-విజయం న్యూస్)

అశ్వారావుపేట మండలం తిరుములకుంట గ్రామ పంచాయితీకి చెందిన టి.అర్.ఎస్ లో ముసలం ఏర్పడింది.. అక్కడ పనిచేస్తున్న స్థానిక ప్రజాప్రతినిదులందరు మూకమ్మడిగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా అశ్వరరావుపేట నియోజకవర్గం టీఆర్ఎస్ లో సంచలనం రేపింది. అశ్వరరావుపేట మండల, తిరుమలకుంట పంచాయతీది ప్రత్యేక స్దానం.ఈ పంచాయతి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది.మండల,జిల్లా స్దాయి నాయకులుండే వారు,తొలిసారిగా తెలంగాణ ఉద్యమ నాయకుడు షేక్ ముబారక్ టి.ఆర్.ఎస్ జెండా కట్టి,పంచాయతి ఎన్నికలలొ పోటి చేయించాడు.

also read :-జాతీయ స్థాయి కథల పోటీలో తడపాకల్ విద్యార్థికి బహుమతి

అనాటి నుండి ఎదిగి నేటికి పంచాయతీలో సర్పంచ్ 8 వార్డ్ లు ,ఎం.పి.టి.సి గెల్చుకుని బలంగా రూపు దిద్దుకుంది. పలువురు కాంగ్రెస్ నుండి టి.అర్ఎస్.తీర్దం పుచ్చుకొన్నారు.ఇంత పటిష్ఠంగా ఉన్న పంచాయతీలో నుండి,సర్పంచ్, ఎనిమిదిమంది వార్డ్ సభ్యులు, ఎమ్.పి.టి.సి మూకమ్మడిగా తమ రాజీనామాలను పార్టీ అధ్యక్షుడుకు సమర్పించారు. సర్పంచ్ సున్నం సరస్వతి, ఎమ్.పి.టి.సి.నారం నాగలక్ష్మి, ఉప సర్పంచ్ జజ్జూరి.రాంబాబు,కె.నాగచెన్నారావు,కె సుధ,అర్ భారతి, ఎమ్.విజయకుమారి, ఎమ్.వాణి, టి.తిరుపతమ్మ, విద్యాకమిటి ఛైర్మన్, మాజీ ఎమ్.పి.టి.సిలు రాజీనామా చేశారు. దీంతో అశ్వరరావుపేట నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. సర్పంచ్, ఎంపీటీసీతో పాటు వార్డు సభ్యులు మూకుమ్ముడిగా రాజీనామా చేయడం పట్ల జిల్లా అంతట చర్చాంశనీయమైంది.

== రాజీనామా ఎందుకు..?

సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు రాజీనామా ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందో వారు విలేఖర్ల సమావేశంలో వివరించారు.  జరిగిన అన్యాయంపై తమ మనోవేదనను వెళ్ల గక్కారు. కన్న తల్లి లాంటి పార్టీకి కొందరు అన్యాయం చేస్తుంటే, మేము నమ్ముకున్న టి.అర్.ఎస్. పార్టీలొ కార్యకర్తలకు తాము న్యాయం చేయలేక పోతున్నామని వారు ఆవేదన చెందారు. మేము కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని,వారు వాపోయారు.

ఇటీవల దళితబందు ఎంపికలో కనీస సమాచారం ఇవ్వకుండా,ఎవరో చెప్పిన వ్యక్తిని ఎంపిక చేయడం జరిగిందని,అదేవిధంగా ట్రైకార్ లో అర్హులు 15 మంది దరఖాస్తు చేసుకోగా,ప్రతిపక్ష పార్టీకి చేందిన కార్యకర్తలు ఎంపిక కావటం పట్ల,మేము ఆదికార పార్టీలో ఉన్నామా. ప్రతిపక్ష పార్టీలొ ఉన్నామా అన్న సందేహన్ని వ్యక్తం చేసారు. సంక్షేమ. అభివృద్ధి పధకాల విషయంలో స్దానిక సర్పంచ్ కు. గాని. ఎమ్.పి.టి.సి కి. గాని. పార్టీ పెద్దలకు గాని, సమాచారం లేకుండా. జరుగుతున్నాయని  ఆరోపించారు. ప్రజా ప్రతినిదులుగా ఉండటం వలన, కార్యకర్తలు, మమ్ములను నిలదీస్తున్నారు, కార్యకర్తలకు మేము న్యాయం చేయలేని పరిస్థితుల్లో మా మనోభావాలు దెబ్బ తినడం వలన. మేమందరం మూకమ్మడిగా రాజీనామ చేయాలని నిర్ణయించుకొని తాము పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .
== గ్రామపంచాయతి పార్టీ అధ్యక్షుడు వివరణ

కనీస సమాచారం లేకుండా అభివ్రుద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వలన మనస్దాపం రాజీనామ చేసారని,తాను నచ్చ చెప్పానని,మండల పార్టీ అధ్యక్షుడు ద్రుష్టికి, ఎమ్.ఎల్.ఎ ద్రుష్టికి తీసుకెళ్లానని చెప్పారు.