Telugu News

ఎల్లుండి ఖమ్మంకు రేవంత్ రెడ్డి రాకా

== ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం

0

ఎల్లుండి ఖమ్మంకు రేవంత్ రెడ్డి రాకా

== ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం

== వరంగల్ నుంచి ఖమ్మం వస్తున్న రేవంత్ రెడ్డి

== రాహుల్ గాంధీ పర్యటనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల 22న ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ.జావిద్ తెలిపారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, ఎండీ.జావిద్, జిల్లానాయకులు మాట్లాడారు. ఈ నెల 22న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నరని తెలిపారు. మే 6వ తారీఖున వరంగల్ జిల్లాలో రైతు సంఘర్షణ సభా కార్యక్రమం నిర్వహించనున్నారని, ఈ సభకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ హాజరువుతున్నారని తెలిపారు.

also read :-రేపు ఖమ్మంకు రేవంత్ రెడ్డి రాకా

ఈ నేపధ్యంలో 22వ తారీఖు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుంతుందని తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా జనసమీకరణ, సన్నాహక కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో చర్చ జరుగుతుందని తెలిపారు. అనాది నుండి కాంగ్రెస్ పేదల పక్షాన పోరాటం చేస్తుందని అందులో భాగంగానే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రైతులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీ నడుం బిగించారని అన్నారు. తెలంగాణ ప్రజలను దోపిడీల నుండి విముక్తి చేయడానికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇస్తే నేడు సొంత రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలను ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ సభ ఒక వేదిక కాబోతోందని అన్నారు. ఈ సభకు జిల్లాలో అన్ని బూత్ స్థాయిల నుండి అధిక జనసమీకరణ చేయాలని అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం నగర అధ్యక్షులు జావేద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రౌడీల అరచకా పాలన సాగుతోందని మండిపడ్డారు.

also read :-ఎస్ఐ దారం సురేష్ నీ సన్మానించిన 1104 బిటిపిఎస్ రీజినల్ ప్రెసిడెంట్ భూక్య హెంలాల్ నాయక్

ఈ అరచాక పాలన అంతానికి ఎంతో సమయం లేదని త్వరలోనే ఈ అరచక వాదులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇస్తే నేడు ఆ తెలంగాణ రాష్ట్రం ఒక్క కుటుంబం చేతిలో బలవుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అందుకు నిదర్శనంగా వరంగల్ సభ నిలవబోతుందన్నారు. 5లక్షల నుంచి 8లక్షల మందిజనం తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వరంగల్ వీధులు కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై వ్యతిరేకత చూపించాలంటే ప్రజలందరు స్వచ్ఛందంగా వరంగల్ సభకు బారీగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు దొబ్బల సౌజన్య, మొక్కశేఖర్ గౌడ్, బొడ్డుబొందయ్య, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, పెండ్ర అంజయ్య, రవికుమార్, బానాల లక్ష్మణ్, కార్పోరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వరరావు, లకావత్ సైదులు తదితరులు పాల్గొన్నారు.