జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి షాక్
వ్యతిరేక ప్రకటనలపై పీసీసీ అధ్యక్షుడు సీరియస్
పార్టీ పదవుల నుంచి తొలగించిన రేవంత్ రెడ్డి
(హైదరాబాద్-విజయంన్యూస్)
కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వోద్దని మొదటి నుంచి వ్యతిరేకించిన జగ్గారెడ్డి సందు దొరికనప్పుడల్లా పీసీసీపై బహిరంగంగానే మీడియా సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డి పై నేరుగా సవాల్ చేస్తూ ప్రకటనలు చేస్తున్న క్రమంలో పీసీసీ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు.
also read;–లింగరంతండా దేవాలయ నిర్మాణానికి కందాళ చేయూత
పార్టీ వర్గింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు మిగిలిన పదవులన్నింటిని తొలగిస్తున్న పీసీసీ సోమవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇన్నాళ్ల పాటు ఎవరేమాటలన్న పట్టించుకుని కాంగ్రెస్ సోనియాగాంధీ ఇటీవలే తీసుకున్న స్ట్రాంగ్ నిర్ణయాలతో పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడేవారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అందులో భాగంగానే గత రెండు రోజులుగా పీసీసీ అధ్యక్షుడిపై బహిరంగగా ఆరోపణలు చేస్తున్న జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని పదవులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. జగ్గారెడ్డికి ఉన్న ఖమ్మం పార్లమెంట్, ఇతర పార్లమెంట్ బాధ్యతలను కూడా తొలగించి అజారుద్దిన్, యాదవ్ లాంటి వారికి బాధ్యతలను అప్పగించారు.
అయితే ఈ నిర్ణయం పీసీసీ అధ్యక్షుడు స్వతహాగా తీసుకున్నవి కాదని, కచ్చితంగా ఏసీసీసీ అదేశాల మేరకే జరిగి ఉంటుందని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో స్పందించేందుకు జగ్గారెడ్డి సిద్దమైయ్యారు. రేపు మధ్యాహ్నం 12గంటలకు మీడియా సమావేశం పెట్టి పార్టీ నాయకుల సంగతేంటో చూసి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జగ్గారెడ్డిపై పీసీసీ చర్యలు తీసుకోవడం సంచలన నిర్ణయమే.. చూద్దాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏలా మారబోతుందో..?