Telugu News

ఈనెల 26న ఖమ్మంకు రేవంత్ రెడ్డి

** 25న కరీంనగర్, 27న నల్గొండ జిల్లాలో పర్యటన

0

ఈనెల 26న ఖమ్మంకు రేవంత్ రెడ్డి

** 25న కరీంనగర్, 27న నల్గొండ జిల్లాలో పర్యటన

(హైదరాబాద్-విజయంన్యూస్)
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన ఖరారైంది. వరంగల్ జిల్లాలో వచ్చే నెల 6న రైతు సంఘర్షణ సభకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ బహిరంగ సభకు జన సమీకరణ నిమిత్తం సమీక్ష సమావేశం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 22న ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించాల్సి ఉండగా ఇతర కారణాల నిమిత్తం ఆ పర్యటన వాయిదా పడింది.

also read :-పువ్వాడకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ

కాగా శనివారం హైదరాబాద్ లోని గాంధీభవన్లో జరిగిన ముఖ్యనేతల సమావేశం జిల్లాల పర్యటన షెడ్యూల్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. 25న కరీంనగర్ 27న నల్గొండ, 26న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో ముఖ్య కార్యకర్తల సమావేశం తోపాటు ఇటీవలే కార్పొరేటర్ల పై అక్రమ కేసులో పెడుతున్న క్రమంలో వారితో మాట్లాడే అవకాశం ఉంది.