Telugu News

26న ఖమ్మంకు రేవంత్ రెడ్డి

అత్యధికంగా హాజరై జయప్రదం చేయాలని దుర్గప్రసాద్ పిలుపు

0

26న ఖమ్మంకు రేవంత్ రెడ్డి

== అత్యధికంగా హాజరై జయప్రదం చేయాలని దుర్గప్రసాద్ పిలుపు

(ఖమ్మం-విజయం న్యూస్);-

మే6న వరంగల్ లో జరిగే సభకు పూర్వ అఖిల భారత కాంగ్రెస్ కమిటి అద్యక్షులు రాహుల్ గాందీ హాజరువుతున్న రైతు సంఘర్షణ సభ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలను సమాయాత్తం చేసేందుకు ఈనెల 26న ఖమ్మం జిల్లాకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క వస్తున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. ఈనెల 26న ఉదయం 11.00 గంటలకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనములో ముఖ్యనాయకులతో సన్నాహక సమావేశం జరుగుతుందని,

also read :-జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఖమ్మం ఎంపీ నామ

ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తో పాటు మాజీ కేంద్రమంత్రి రేణుకచౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు హాజరువుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు, బ్లాక్,మండల,పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు , కార్యవర్గ సభ్యులు జిల్లా అనుబంధ సంఘ అద్యక్షులు,కార్యవర్గ సభ్యులు,జిల్లా కాంగ్రెస్ నాయకులు,ముఖ్య నాయకులు సకాలంలో విచ్చేసి కార్యక్రమమును జయప్రదం చేయగలరని కోరారు.