Telugu News

జీళ్ళచెరువు లో జెండా అవిష్కరణ చేసిన రేవంత్ రెడ్డి..

ఖమ్మం విజయం న్యూస్

0

జీళ్ళచెరువు లో జెండా అవిష్కరణ చేసిన రేవంత్ రెడ్డి..

(ఖమ్మం విజయం న్యూస్ ):-

ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి జీళ్ళచెరువు గ్రామంలో కాంగ్రెస్ జెండా అవిష్కరణ చేశారు. వచ్చెనెల 6న వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభ కార్యక్రమానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న సంధర్భంలో ఆ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఖమ్మంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యేందుకు ఖమ్మంజిల్లాకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మార్గంమధ్యలోని కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు..

also read :-ములుగు జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాంత్

స్థానిక నాయకులు పెండ్ర అంజయ్య, మద్దెల ఉపేందర్, ఐతగాని ప్రభాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు కత్తి శ్యామ్, యూత్ అధ్యక్షుడు కొండా ప్రసాద్, ఐతగాని నాగేశ్వరరావు, కొండా శ్రీనివాస్ రావు, మొక్క ఉపేందర్, దంతాల శ్రీనివాస్, మొక్క రాము, ఐతగాని రంగయ్య, నిప్పు శ్రీను, గుండమాల వీరబాబు తదితరులు రేవంత్ రెడ్డి కి కండువ, శాలువలను కప్పి ఘనస్వాగతం పలికారు.