Telugu News

నగరాభివృద్ధిలో భాగంగానే రోడ్లు ఎర్పాటు..

- ప్రజా రవాణా ద్వారా డివిజన్లు అభివృధ్ధి

0

నగరాభివృద్ధిలో భాగంగానే రోడ్లు ఎర్పాటు..

– —ప్రజా రవాణా ద్వారా డివిజన్లు అభివృధ్ధి

—- అవసరం ఉన్న ప్రతి వీధిలో రోడ్లు వేసాం : మంత్రిపువ్వాడ

—- రూ.30 కోట్ల నిధులతో 41డివిజన్లో 140 రోడ్స్ వేసాం.

—- 51వ డివిజన్లో రూ.26.80 లక్షలతో Vdf రోడ్డును ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

– —కాంగ్రెస్ పార్టీ నుండి తెరాసలో చేరిన 70 కుటుంబాలు.

(ఖమ్మం  విజయం న్యూస్):-

ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను సీసీ రోడ్స్ నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం 51వ డివిజన్ నూతన బస్ స్టాండ్ పక్కన రోడ్డు రూ.26.80 లక్షలతో ఆధునిక VDF టెక్నాలజీతో నిర్మించిన రోడ్డు ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభించారు.ఖమ్మం నగరాభివృద్ధికి తోలి అడుగు రోడ్స్ అని గుర్తించి డివిజన్లలో అవసరం అయిన చోట్ల రోడ్స్ వేయాలని తలచి ముఖ్యమంత్రి కేసీఅర్  దృష్టి కి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు.

also read :-ఏడాదిగా చెబుత‌న్నాం… కేంద్రం తెలంగాణ రైతాంగంపై ప‌గ ప‌ట్టింద‌ని!

ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు(ఎస్ డీఎఫ్) రూ.30 కోట్ల నిధుల నుండి కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్ లో 140 రోడ్స్ ను గుర్తించి ఏర్పాటు చేయడం జరిగిందన్నారుపూర్తి అయిన రోడ్స్ ఇప్పటికే పూర్తి చేయడమైనదని, మిగిలిన కొన్ని రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ఎక్కువకాలం మన్నికతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని పిడిఎఫ్ రోడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఇప్పటికే నగరంలో పలు ప్రధాన దారుల్లో బ్లాక్ టాప్(బీటీ) రోడ్స్ వేయడం జరిగిందన్నారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే రోడ్లు వేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పించామని పేర్కొన్నారు.

also read :-కేంద్రానికి మరోసారి తెలంగాణ దెబ్బ రుచి చూపిద్దాం

అభివృధ్ధి సాధించాలంటే ఊరికే కాదని అందుకు కొట్ల రూపాయల నిధులు అవసరం అన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఅర్  సహకరించడం వల్లే ఇంత అభివృధ్ధి చేయగలిగానని అన్నారు.ఎక్కడ అవకాశం ఉన్న నిధులు ఖమ్మంకు తెచ్చుకుంటున్నమని అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ నుండి నేర్చుకోవాలి అని ఇతర మున్సిపాలిటీ, కార్పొరేషన్ లు చూసి వెళ్ళే స్ధాయికి మనం వచ్చామని అన్నారు.

also read :-గల్లీ లో పీకలేనోడివి ఢిల్లీలో పీకుతావా
ఖమ్మంలో ఒక్కో రంగానికి కోట్ల రూపాయలు కేటాయిస్తూ అభివృధ్ధి చేసుకుంటున్నామని వివరించారు. ఎక్కడ త్రాగునీటి కి ఇబ్బంది రాకుండా చేయాలని బలంగా సంకల్పించానని అన్నారు.ఒకప్పుడు పబ్లిక్ tap దగ్గర మహిళలు బిందెలు పట్టుకుని గంటల తరబడి వేచి చూసే వారు అని, కాని నేడు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 35వేల మందికి ఇంటింటికీ నల్లా ద్వారా శుద్ధమైన త్రాగునీటి నల్లల ద్వారా నీరు అందిస్తున్నామని వివరించారు.24గంటల నాణ్యమైన విద్యుత్ ను ఇస్తున్నామని అన్నారు. ఒక్క గంట విద్యుత్ అంతరాయం లేకుండా ఇస్తున్నామని, తెలంగాణ వేస్తే విద్యుత్ సమస్య వస్తది అని అన్న నోర్లు మూత పడే విధంగా ముఖ్యమంత్రి కేసీఅర్  చేశారని అన్నారు.

– కాంగ్రెస్ నుండి తెరాస లో చేరిన 70 కుటుంబాలు..

ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని 51వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల 70 కుటుంబాలు తెరాసలో చెరారు.

Sk పాషా, రాము రాథోడ్, కవిత రాథోడ్, అలకుంట రవి, గోగుల మల్లేశ్, డి క్రిష్ణ, అలకుంట రాము, అలకుంట వెంకన్న, డి చిన్నకోటయ్యతో పాటు మొత్తం 70 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు కార్పొరేటర్ శీలంశెట్టి రమ అధ్వర్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

TRS పార్టీలోకి చేరిన వారికి మంత్రి పువ్వాడ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

మంత్రి వెంట మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, పబ్లిక్ హెల్త్ ఈజ్ రంజిత్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్‌లు శ్రీలంశెట్టి రమ వీరభద్రం, బర్రి వెంకట కుమార్, నాయకులు పగడాల నాగరాజ్, పొన్నం వేంకటేశ్వర్లు, జక్కుల లక్ష్మయ్య, పిన్ని కోటేశ్వర రావు తదితరులు ఉన్నారు.