Telugu News

ఆర్టీసీ పరిరక్షణే లక్ష్యంగా సర్కార్ అడుగులేస్తోంది : మంత్రి పువ్వాడ

ఆర్టీసీ ప్రతి ఒక్కరికి సుపరిచితమైంది

0

ఆర్టీసీ పరిరక్షణే లక్ష్యంగా సర్కార్ అడుగులేస్తోంది : మంత్రి పువ్వాడ
== ఆర్టీసీ ప్రతి ఒక్కరికి సుపరిచితమైంది
== పౌరసేవలు రవాణాశాఖ ప్రజలకు ఆర్టీవో కార్యాలయానికి రాకుండా చేసింది
== గడ్డు పరిస్థితిల్లో కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించాము
== అసెంబ్లీ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ అడుగులేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా శాసనసభలో రవాణా శాఖ సంబంధిత బడ్జెట్ పద్దును రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రతిపాదించిన అనంతరం జరగిన చర్చలో మంత్రి అజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో పలువురు శాసనసభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలతో మంత్రి వివరణ ఇచ్చారు.

also read :-సీఎం పదవికి యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా

ఆర్టీసీ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రవాణా శాఖ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఉన్నదన్న ఈ విషయం ప్రతిఒక్కరికీ సుపరిచితమైనదన్నారు. పౌర సేవలు రవాణా శాఖ ప్రజలకు ఆర్టీవో కార్యాలయానికి రాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రవాణా శాఖ సకాలంలో పారదర్శకంగా సేవలు ప్రజలకు అందజేస్తున్నామని అందులో దాదాపు 17 సేవలు ఎనీ వేర్ ఎనీ టైం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ లు, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ చిరునామా మార్చుకునే సౌకర్యం కొత్త పర్మినెంటు వాహనాలకు ఇచ్చే దాంట్లో పాత పర్మినెంట్ ప్రార్థన చేసే దానికి ట్రేడ్ సర్టిఫికెట్లు బ్యాడ్జీలు రవాణా కోసం స్మార్ట్ కార్డులు సీ కార్డు లైసెన్స్ స్థానంలో కొత్తవి పాతవి ప్రింట్ తీసుకునే స్థానంలో గడువు ముగిసిన లైసెన్సులు స్థానంలో కొత్త లైసెన్సులు లు చేయడం జరుగుతుందని అన్నారు.

also read :-సీఎం పదవికి యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా

రవాణా శాఖ దాదాపు మూడు సంవత్సరాలుగా కరోనాతో ఆదాయం ఎక్కువ లేదన్నారు. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా బయట తిరగని పరిస్థితి ఉన్నదన్న విషయం అందరికీ తెలుసని అలాంటి సందర్భంలోను ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించిన పరిస్థితి ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి తో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. దాదాపు గడిచిన ఏడు నెలల నుండి మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని సీఎం కెసిఆర్ మానవతా దృక్పథంతో ప్రభుత్వ సహాయం 1500 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడం హర్షించదగ్గ శుభపరిణామమని అన్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉన్నదని కార్మికులను ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తున్నామని ఎవరైనా అదనపు డ్యూటీలు చేస్తే వారికి అదనపు జీతభత్యాలు ఇవ్వబడుతుందని వారు అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం లో విద్యార్థులు ఆడపిల్లలు ప్రయాణిస్తున్నారని ఆడపిల్లలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని దాంతో పాటుగా బస్ సౌకర్యం కల్పించి వారిని ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు.

also read;-పాలేరు కారు పార్టీలో కలవరం

30 వేల బస్సు ట్రిపుల్ అను, ఏర్పాటు చేసి మేడారం జాతరను మహా ప్రతిష్టాత్మకంగా ఆర్టీసీ రవాణా శాఖ తీసుకొని పదకొండు లక్షల మంది ప్రయాణాలు కొనసాగించి గమ్యానికి చేర్చడం జరిగిందని వారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కొరకు తార్నాక నందు ఏసీ గదులతో సకల సౌకర్యాలతో కూడిన ఆస్పత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే నిమ్స్ నందు మెడికల్ బిల్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉద్యోగస్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసి రవాణా సౌకర్యాలు పెంచడం జరిగిందని అలాగే స్త్రీలకు ప్రత్యేక భద్రతకు మై బస్ ఇస్ సేఫ్ అనే పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు. కార్గో సేవలను విస్తృతంగా పరిచి ప్రజల సౌకర్యార్థం తక్కువ చార్జీలతో సౌకర్యాలను మెరుగుపరుస్తూ ట్రాన్స్పోర్టు మెరుగైన విధానాన్ని కొనసాగిస్తూ ప్రజలకు కొనసాగించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్గో సర్వీస్ మొదలు జూన్ 3 2020 నాడు ప్రారంభించి కార్గో సేవలను ప్రజలకు చేరువ చేసే విధంగా తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఫ్యాన్సీ నెంబర్లతో అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే విధంగా చర్యలు చేపట్టి కోట్ల రూపాయల ఆదాయాన్ని రవాణా శాఖ చేపట్టడం జరిగిందని సభ్యులకు తెలియజేశారు. ఆ

ర్టీసీ డిపో పరిసర ప్రాంతాల్లో స్థలాలను ఎవరికి లీజుకు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. డ్రైవింగ్ స్కూల్ లను ఏర్పాటు చేసి ఎంతో మందికి లైసెన్స్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతి పేదవాడికి ఆర్టీసీ రక్షణ విషయాన్ని గుర్తు చేసి వారి సౌకర్యార్థం లేక సంస్కరణలు తీసుకు వచ్చి వారికి సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజులలో రవాణాశాఖ ను మరింత బలోపేతం చేసి ఆర్థిక పురోగతిని సాధించే విధంగా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.