బీజేపీ కార్యకర్తలకు కాషాయ టోపీ
(అశ్వారావుపేట విజయం న్యూస్):-
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక నుంచి కాషాయ టోపీలు ధరించి కనిపించోతున్నారు. . మంగళవారంనాడు న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా కాషాయ టోపీలు ధరించి కనిపించారు. ఈనెల 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఒకరోజు ముందే ఈ క్యాప్‌లను అందుబాటులోకి తెచ్చారు.కాషాయ టోపీలను కార్యకర్తలందరకికీ చేరవేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయిరాబోయే రోజుల్లో ఈ టోపీలు బీజేపీ కార్యకర్తల ఐడెంటిటీ గా మారే అవకాశాలున్నాయి.
also read:-చైనాలో కరోనా మళ్ళీ పంజా!
ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందు అహ్మాదాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో ఈ కాషాయ టోపీ ధరించారు. తుది డిజైన్ ఖరారు చేసే మందు పలు డిజైన్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. సొగసుగా, ఫ్యాషన్‌గా కనిపించే తీరులో ఈ టోపీలను రూపొందించారు. క్యాప్ పైన పలచని ఎంబ్రాయిడరీ, ప్లాస్టిక్ లోటస్ (బీజేపీ ఎన్నికల గుర్తు) ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి హాజరైనప్పుడు ప్రధాని మోదీ ధరించిన టోపీ స్ఫూర్తితో కాషాయ టోపీను డిజైన్ చేసినట్టు చెబుతున్నారు