గోశాలలకు 135 ట్రక్కుల పశుగ్రాస ట్రాక్టర్ ను ప్రారంభించిన సండ్ర వెంకట వీరయ్య.
(తల్లాడ విజయం న్యూస్):-
గోశాలలకు పశుగ్రాస వితరణకుల 135 ట్రక్కుల పశుగ్రాస ట్రాక్టర్ ను జెండా ఊపి ప్రారంభించిన శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య.సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని రైతుల సహకారంతో ఖమ్మంలోని 11 గోశాలకు వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి పశుగ్రాసంతో బయల్దేరిన 135 ట్రక్కుల పశుగ్రాస ట్రాక్టర్లను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తల్లాడ లో గోపూజ నిర్వహించి అనంతరం జెండా ఊపి ట్రాక్టర్లను ప్రారంభించారు.