Telugu News

కోనాయిగూడెంలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్

నేలకొండపల్లి/కూసుమంచి-విజయంన్యూస్

0

కోనాయిగూడెంలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్

(నేలకొండపల్లి/కూసుమంచి-విజయంన్యూస్);-

నేలకొండపల్లి మండలం లోని కోనాయిగూడెం గ్రామంలో గురువారం చలి వేంద్రం ను సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కలెక్టర్ ఆదేశాలు మేరకు చలి వేంద్రం ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

also read :-బండి సంజయ్ మీ పాదయాత్ర ఎవరికోసం?

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసయ్య , వార్డు సభ్యులు జంగం లక్ష్మినారాయణ, గుడెల్లి రంగయ్య, గుడిల్లి తిరపయ్య బోయినపల్లి నాగమణి., కార్యదర్శి వీరబాబు, గ్రామ పెద్దలు పాకనాటి కన్నరెడ్డి ,తిగుల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.