***ఖమ్మం నడిబొడ్డున ఆత్మగౌరవ సౌధాలు
***టేకులపల్లిలో 1248 డబుల్ ఇండ్లు నిర్మాణం
***మంత్రి అజయ్ కృషితో మరో 240 ఇండ్లు
***పేదలకు పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్
***(ఖమ్మం విజయం న్యూస్):-
కూడు, గూడు, గుడ్డ అనేవి మనిషికి ప్రాథమిక అవసరాలు. నాగరికత అభివృద్ధి చెందిన నేటి కాలంలో అవి ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనాలు. ఏదో ఒకటి అనే స్థాయినుంచి తాము కోరుకున్నదే ఎంచుకునే స్థాయికి సమాజం చేరుకుంటున్నది. ఈ నేపథ్యంలో పేదలకు నివాసం అంటే చాలీ చాలని ఇరుకుగది కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కనీసం రెండు తరాలకు ఉపయోగపడే విధంగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి ఉచితంగా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టింది.
ALSO READ :-పలు హాస్పిటల్స్ ప్రారంభించి, శుభకార్యాలయలకు హజరైన మంత్రి పువ్వాడ..
ఖమ్మం నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృషి ఫలితం ఆవిష్కృతం కానుంది నగరంలోని 1008 మంది నిరుపేదలకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్, టేకులపల్లిలోని కేసిఆర్ టవర్స్ లో ఒకే చోట డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇప్పటికే లబ్ధిదారులకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ చేతులమీదుగా అందజేయగా మరో 240 ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా అతి త్వరలోనే రాష్ట్ర మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ పేదలకు పంపిణీ చేయనున్నారు.
ఇండ్ల స్వరూపం – మౌళిక సదుపాయాలు
నాడు ఎన్నికల సమయంలో ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వాగ్ధానం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ వలె ఒకే చోట ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించటం మొదటి ప్రాంతం ఇది. మంత్రి అజయ్ కుమార్ పర్యవేక్షణలో నిర్మించిన ఈ ఇండ్లు నిరుపేదలకు నివాసయోగ్యంగా, వారి ఆత్మ గౌరవం కాపాడేలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు (560 చదరపు అడుగులు) నిర్మించి ఇస్తున్నది. ఈ డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు, ఇండ్లలో రెండు పడక గదులతోపాటు, హాలు, వంటగది, 2 టాయిలెట్లు ఉంటాయి. ప్రత్యేక కాలనీల్లో కొత్తఇండ్లను నిర్మిస్తున్నారు. మోడల్ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకిరువైపులా చెట్లు, ప్రతీ ఇంటిముందూ మొక్కలు నాటుతున్నారు. ఇందుకోసం అదనంగా ఖర్చవుతున్నా ప్రభుత్వమే భరిస్తున్నది. ప్రతీఇంటికి వేర్వురుగా మెట్లు, వాటర్‌ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు.
also read :-కూసుమంచి మండలంలో అక్రమ చెరువు మట్టి తరలింపు…
ఒక్కో ఇంటి ఖర్చు : ఈ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూరల్ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షలు ఖర్చు చేస్తున్నది. వీటిలో రూ. 5.04 లక్షలు ఇంటి నిర్మాణానికి, రూ.1.24 లక్షలు మౌలిక సదుపాయాల కోసం ఖర్చుచేస్తున్నారు. మోడల్ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకి ఇరువైపులా చెట్లు, ప్రతి ఇంటిముందు మొక్కలు నాటుతున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
మా కాలనీకు ఎందరో వచ్చారు. చూసి వెళ్లిపోయారు తప్ప మాపై కరుణ చూపలేదు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మా కాలనీవాసులందరం కలిసి సమస్య వివరించగానే ఆయన స్వయంగా వచ్చి మా బాధలు చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని ప్రకటించి, మాట నిలబెట్టుకున్నారు. అతి స్వల్ప కాలంలోనే ఇండ్లు నిర్మించి మాకు అందించారు. అల్లా దయ వలన మంత్రి అజయ్ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము.
– జానీ పాషా
మంత్రి అజయ్ వల్లే ఆనందంగా ఉన్నాం
ఈ రోజు మేము ఆనందంగా ఉండడానికి మంత్రి అజయే కారణం. ఎప్పుడు మాపై పెచ్చులూడి పడతాయోననే భయంతో నిదురపట్టేది కాదు. అలాంటి మాకు అన్ని సదుపాయాలతో కూడిన అద్భుతమైన ఇండ్లను కట్టించి ఇచ్చిన మంత్రి పువ్వాడ ఎల్లప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో, నిండు నూరేండ్లు సుఖంగా జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము.
– లక్ష్మమ్మ
మనసున్న మంత్రి
గరిబోళ్ల కష్టాలను గుర్తించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మా వద్ద నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా 1200 ఇండ్లను నిర్మించి ఇచ్చారు. పేదల హృదయాలలో స్థానం సంపాదించుకున్న ఇలాంటి మనసున్న మంత్రి అజయ్ కుటుంబమంతా ఈ రోజు సంతోషంగా ఉండడానికి కారకుడైన మంత్రి అజయ్ కుమార్ నిండు నూరేండ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాము.
– ప్రసాద్ రావు