Telugu News

కూసుమంచి మండలం లో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

** పోచారంలని  రైతు వేదిక వద్ద ధర్నా చేస్తున్న షర్మిళ

0

కూసుమంచి మండలం లో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

** పోచారంలని  రైతు వేదిక వద్ద ధర్నా చేస్తున్న షర్మిళ

** టీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడిన షర్మిళ

(కూసుమంచి-విజయం న్యూస్);-

ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిళ చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాల గత మూడు రోజులుగా కొనసాగుతుండగా బుధవారం కూసుమంచి మండలంకు చేరుకున్నారు. కూసుమంచి మండలంలోని పెద్ద పోచారం గ్రామంలో పాదయాత్ర కొనసాగుతున్న తరుణంలో సీఎం కేసిఆర్ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కూసుమంచి మండలం పోచారం గ్రామం లో రైతు వేదిక ముందు షర్మిళ ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున రైతులు హాజరైయ్యారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులు ఆ ప్రభుత్వానికి ఉరి వేయాలని సూచించారు