నేడు ఖమ్మం జిల్లాకు షర్మిళ పాదయాత్ర
== తిరుమలాయపాలెం మండలంలోని సోలిపురం క్రాస్ రోడ్డు ద్వారా చేరిక
== 60 రోజులు 600 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నషర్మిళ
== అన్ని నియోజకవర్గాలలో పాదయాత్ర
== చివరిగా నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద ముగింపు
== భారీగా ఏర్పాట్లు చేస్తున్న వైఎస్ఆర్టీపీ నాయకులు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిళ చేపట్టి ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం ఖమ్మం జిల్లాకు రానుంది.రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలో భాగంగా పాదయాత్ర చేపట్టిన ఆమె సోమవారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. సూర్యపేట జిల్లాలో ముగించుకుని పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం కాకరవాయిగ్రామం సోలిపురం క్రాస్ రోడ్డు ద్వారా ఆమె ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సుమారు 60 రోజుల పాటు 600 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలని సంకల్పించిన షర్మిళ అందుకు తగ్గట్లుగా రూట్ మ్యాఫ్ ను ఏర్పాటు చేశారు. అయితే స్థానిక నాయకత్వం కోరిక మేరకు మరికొన్ని గ్రామాలను కలుపుకుని పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు 60 రోజుల పాదయాత్ర కాస్తా 70 రోజులు 700 పాదయాత్రగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం 60 రోజుల పాటు మాత్రమే పాదయాత్రకు షెడ్యూల్ ను విడుదల చేశారు.
also read;-గిరిజనులను మోసం చేసింది టీఆర్ఎస్
అయితే ముందుగా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో కాకరవాయి గ్రామంలో ప్రారంభమైయ్యే ఈ పాదయాత్ర, సోలిపురం క్రాస్ రోడ్డు నుంచి కాకరవాయి గ్రామానికి చేరకుని అక్కడ ప్రసంగించనున్నారు. కాకరవాయి గ్రామంలో లంచ్ విరామం తీసుకోనున్నారు. ఆ తరువాత జూపేడ గ్రామంలో ప్రజలతో మాటముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం కె.తండా క్రాస్ రోడ్డు నుంచి బచ్చోడుతండా, బచ్చోడు గ్రామం, గైగొళ్లపల్లి క్రాస్ రోడ్డు వరకు వచ్చి అక్కడ నైట్ హాల్ట్ చేయనున్నారు. అనంతరం 5న చౌటపల్లి క్రాస్ రోడ్డు, బందంపల్లి గ్రామం మీదగా బీరోలు గ్రామం చేరుకుని అక్కడ నిరుద్యోగ నిరహారదీక్ష్ చేపట్టనున్నారు. అనంతరం తెట్టెలపాడు క్రాస్ రోడ్డు, తాళ్లచెరువు క్రాస్ రోడ్డు వద్ద నైట్ హాల్ట్ చేయనున్నారు.
also read;-చింతకాని దళితులకు శుభవార్త
== కూసుమంచి మండలంలో
రాత్రి బస అనంతరం కూసుమంచి మండలంకు షర్మిళ పాదయాత్ర చేరనుంది. కూసుమంచి మండలంలోని పెద్ద పోచారం గ్రామం ద్వారా పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం చిన్నపోచారం. నర్సింహులగూడెం క్రాస్ రోడ్డు, కిష్టాపురం గ్రామానికి చేరుకుని అక్కడ లంచ్ చేయనున్నారు. అనంతరం కూసుమంచి గ్రామానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసే పబ్లిక్ మీటింగ్ లో హాజరుకానున్నారు. అనంతరం చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద రాత్రి బస చేయనున్నారు. 7న చింతలతండా, చేగొమ్మ, ఎర్రగడ్డ, చేరుకుని అక్కడ లంచ్ చేయనున్నారు. అనంతరం కొక్కిరేణి, తిరుమలాయపాలెం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడనున్నారు.అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఆ తరువాత జరిగే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ టీపీ నాయకులు షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.
== భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
ఖమ్మం జిల్లాకు పాదయాత్ర ద్వారా వస్తున్న వైఎస్ఆర్ టీపీ అదినేత్రి వైఎస్ షర్మిళ కు భారీగా స్వాగతం చెప్పేందుకు వైఎస్ఆర్ అభిమానులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా సరిహద్దులో భారీగా ప్లెక్సిలను ఏర్పాటు చేస్తున్నారు. షర్మిళకు సరిహద్దులో పూలవర్షంతో స్వాగతం పలికేందుకుఏర్పాటు చేస్తున్నారు. అలాగే అడుగడుగున మహిళలు స్వాగతం పలికే విధంగా జిల్లా పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ పాదయాత్రకు జన సమీకరణ చేస్తున్నారు.
== షర్మిళ పాదయాత్రను జయప్రదం చేయండి : మాజీ జడ్పీచైర్మన్ గడిపల్లి కవిత
వైఎస్ షర్మిళ పాదయాత్ర ద్వారా ఖమ్మం జిల్లాకు వస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ టీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సూపర్ సక్సెస్ చేసేందుకు సహాకరించాలని, పెద్ద సంఖ్యలో జనం తరలిరావాలని వైఎస్ఆర్టీపీ ఉమ్మడి జిల్లా కోఆర్డీనేటర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత కోరారు. సుమారు 60 రోజుల పాటు 600 కిలో మీటర్ల దూరం పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో షర్మిళ పాదయాత్ర చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ రెండు నెలల పాటు జరిగే ఈ పాదయాత్రకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని, ప్రజలందరు పెద్ద సంఖ్యలో హాజరై ఆమె పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు.