కెసిఆర్ పై నిప్పులు వర్షం కురిపించిన షర్మిల.
కెసిఆర్ బుద్ధి గాడిద బుద్ధి.
గాడిదకు రంగు పూసి ఇది ఆవు అని నమ్మించే ప్రభుత్వం కెసిఆర్.
ఊసరవెల్లిలా పార్టీలు మార్చిన ఎమ్మెల్యే మెచ్చ పై మండిపడ్డ షర్మిల.
దమ్మపేట బస్టాండ్ విషయంలో అభివృద్ధి సాధించలేని ఎమ్మెల్యే మెచ్చ.
(దమ్మపేట విజయం న్యూస్):-
కెసిఆర్ బుద్ధి గాడిద బుద్ధి అని షర్మిల మండిపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, దమ్మపేట సెంటర్లో ఘనంగా షర్మిల పాదయాత్ర జరిగింది. పోలీస్ నోటిఫికేషన్ తప్ప మరే ఇతర నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రభుత్వం తన ప్రభుత్వం కాదని, పోలీస్ రక్షణ లేనిదే తెలంగాణ ప్రభుత్వం లేదని ఆరోపించింది. వర్షానికి అన్ని పంట పొలాలు కొట్టుకుపోయిన వాటికి నష్టపరిహారం ఇచ్చే ఉద్దేశం కేసీఆర్కి లేదని, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా నిరుద్యోగుల గురించి పట్టించుకోవడంలేదని, దళిత హక్కు పథకాలు పేరుకు మాత్రమే కానీ వాటిని మంజూరు చేసే ప్రభుత్వం కాదు అని, వరి పంట వేసిన రైతులు నష్టం వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారిని పట్టించుకోవడం లేదని, డీజిల్ పెట్రోల్ ధరలు అధికంగా పెంచి జనాల సొమ్ము తింటున్నాడు కేసీఆర్ పై ఆవేదన వ్యక్తం చేసింది.
also read :-బట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్ ని కలిసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
డబల్ బెడ్రూమ్ ఇల్లు దళితులు అందరికీ ఇస్తానని ఎక్కడో కొంతమందికి ఇల్లు ఇచ్చి రాష్ట్రం లో ఉన్న దళితులు అందరికీ ఇల్లు ఇచ్చినట్టు డప్పు కొట్టుకుంటున్న కెసిఆర్ అని, గాడిదకు రంగు పూసి ఇది ఆవు అని నమ్మించే స్వభావం కెసిఆర్ అని, కెసిఆర్ పార్టీ ఆఫీస్ రెస్టారెంట్ హోటల్ గా మారింది అని షర్మిల పేర్కొంది. కెసిఆర్ కి దమ్ముంటే నాతో పాదయాత్ర చేస్తే ప్రతి ఒక ఊరిలో ఉన్న సమస్యలను తెలుస్తాయని, ప్రజల కష్టాలు ఏంటో తెలుస్తాయి అని, సమస్యలు అనేవి లేకపోతే రాజీనామా చేస్తానని, నా ముక్కు కేసీఆర్ ముందు రోడ్డుకు వేసి గీసుకుంటా అని షర్మిల సవాల్ విసిరింది.
also read :-వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి ని కలిసిన కాంగ్రెస్ నేతలు…
టిడిపి పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి నిధులు సరిగ్గా అందడం లేదని టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే మెచ్చా కి సిగ్గు లేదు అని, దమ్మపేట మండలం లో డిగ్రీ కాలేజ్ కూడా నిర్మించ లేదు అని, ఉన్న బస్ స్టాండ్ పరిస్థితి ఎమ్మెల్యే వద్దుకు తీసుకెళ్ళిన ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ప్రభుత్వం నుండి వచ్చే నిధులను అక్రమంగా దోచుకుంటున్నారని ఎమ్మెల్యే పైన షర్మిల మండిపడింది. ఈసారి వచ్చే ఎలక్షన్లో నన్ను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు, గిరిజనులకు, ప్రతి ఒక్కరికి బంగారు తెలంగాణ అంటే ఏంటో తెలియజేస్తానని హామీ ఇచ్చింది షర్మిల.