Telugu News

జర్నలిస్ట్ దండి భాస్కర్ కు ఘన నివాళులు

రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్  విజయం న్యూస్

0

జర్నలిస్ట్ దండి భాస్కర్ కు ఘన నివాళులు

(రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్  విజయం న్యూస్);-

లో జర్నలిస్ట్ దండి భాస్కర్ కు రూరల్ విలేకరులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని, చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూ ఐ జే యు నాయకులు, ప్రజా పక్షం బ్యూరో ఏనుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… దండి భాస్కర్ తో పత్రిక విలేఖరి గానే కాకుండా అభ్యుదయ భావాలు కలిగిన నికార్సయిన కామ్రేడ్ గా పరిచయం ఉందన్నారు. క్యాన్సర్ మహమ్మారి తో బాధపడుతున్న ఆ సమయంలో కూడా చూపించిన తెగువ స్పూర్తిదాయక మన్నారు. పత్రికలో రాసే కథనాలు పెట్టె లీడ్స్ కదిలించే వని ప్రతి కథనం ప్రజల కోసం రాశారని కొనియాడారు. టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ సంఘ నాయకులు రామిశెట్టి విజేత మాట్లాడుతూ…

also read :-కన్నాయిగూడెం, వైన్స్ షాప్ లో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు

తాను ఖమ్మం రూరల్ లో పత్రిక విలేకరిగా పనిచేస్తున్న క్రమంలో సలహాలు సూచనలు అందించారన్నారు. రాసే కథనాలలో ధైర్యాన్ని నింపుతూ, నేనున్నా అనే భరోసాను కల్పిస్తూ ముందడుగు వేసేలా భుజం పెట్టారని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దండి భాస్కర్ అన్నయ్య సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ… పత్రిక విలేకరిగా అందించిన సేవలు అజరామరం ఆయనవి అన్నారు. దండి భాస్కర్ ను కోల్పోవడం తమ కుటుంబానికి తీరని లోటుగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంస్కరణ సభలో విలేకరులు నర్సింగ్ రంగారావు, పెరు మళ్ళపల్లి రమేష్ , బంక అశోక్, యాస లక్ష్మారెడ్డి, తీగల చంద్రశేఖర్, కర్లపూడి రామదాసు, లక్ష్మణ్, కా మల్ల వెంకట్, పొట్లకాయల వినయ్ ,వెల్తురు వీరా కుమార్ , గంగాధర్ , జక్కంపూడి కృష్ణ, దండి భాస్కర్ తనయుడు డాక్టర్ దండి క్రాంతి పిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు