గిరిజన శక్తి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ నాయక్ నియామకం
(కూసుమంచి-విజయంన్యూస్);-
ఖమ్మం జిల్లా గిరిజన శక్తి అధ్యక్షుడిగా జర్పుల శ్రీనివాస్ ను నియమించారు. కూసుమంచి మండలం ఎర్రగడ్డతండా గ్రామానికి చెందిన జర్పుల శ్రీనివాస్ నాయక్ ఇటీవలే గిరిజనుల, బంజారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ జర్పుల శ్రీనివాస్ కు అధ్యక్షుడిగా అవకాశమిస్తూ శనివారం నియామక పత్రాన్ని అందజేశారు.
also read :-నెరవేరుతున్న యువత పోలీస్ కల
ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన ప్రజల సమస్యలపై పోరాడుతనని, గిరిజన రిజర్వేషన్ పెంపు సాధనకై ఉద్యమిస్తామని, ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభానికి,గిరిజన భందు సాధన కోసం,జిల్లాలోని పోడు భూముల సమస్యల పరిష్కారానికి,ప్రతి మండలంలో,ప్రతి తండాలో గిరిజన శక్తి నిర్మాణం చేస్తానని,తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షులకు,రాష్ట్ర కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు.