బహుజనులకు రాజ్యాధికారం తథ్యం
== 93శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం ఎందుకురాదు
== కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది
== బంగారు తెలంగాణ కాదు..బయపెట్టే తెలంగాణగా మారింది
== మాట్లాడితే కేసులు పెట్టి భయపెడతున్నరు
== రాబోయేది బీఎస్పీ రాజ్యమే
== రాజ్యాధికారయాత్రలో బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్
== కూసుమంచి మండలంకు చేరుకున్న రాజ్యాధికార యాత్ర
(కూసుమంచి-విజయంన్యూస్)
రాబోయే రోజుల్లో బహుజనులకు రాజ్యాధికారం తథ్యమని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ తెలిపారు. బహుజనులను మెలుకోల్పేందుకు, బహుజనులను చైతన్యపరిచేందుకు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన రాజ్యాధికార యాత్ర సోమవారం ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంకు చేరింది. దీంతో జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం గ్రామం వద్ద బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఘనస్వాగతం పలికారు. అనంతరం పాలేరు, గట్టుసింగారం, మల్లేపల్లి, కూసుమంచి గ్రామాల్లో పర్యటించిన ఆయన పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
also read;-రిలయన్స్ స్మార్ట్ లో కరెంట్ షాక్ తో యువకుడు మృతి
మల్లేపల్లిలో పార్టీ గద్దే నిర్మాణం జరిగితే దానికి టీఆర్ఎస్ నాయకులు కూల్చేవేశారు. కాగా ఆ గద్దేను పరిశీలించి టీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీది నడుస్తుందని ఎగిరేగిరి పడకండి, మాకు రోజుల్లోస్తాయని ఆయన చెప్పకనే చెబుతూ హెచ్చరించారు. పార్టీ గద్దను కూల్చడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. అనంతరం గట్టుసింగారం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ అసాంఘిక పనులకు ఉపయోగపడుతున్నాయని, వాటి కోసమే సీఎం కేసీఆర్ నిర్మాణం చేసిందన్నారు. ప్రజాధనం వధాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సాయంత్రం సమయంలో కూసుమంచిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని, ఒక కుటుంబ పాలన, కుటుంబానికి ఆదాయం, కుటుంబానికి రాజ్యాధికారం తప్ప మరోక్కటి లేదన్నారు. అవకాశం ఉంటే రాబోయే ఎన్నికల్లో తన మనవడికి కూడా సీటు ఇచ్చే అవకాశం ఉందని యద్దేవా చేశాడు.
also read;-రిలయన్స్ స్మార్ట్ లో కరెంట్ షాక్ తో యువకుడు మృతి
సీఎం కేసీఆర్ పాలన ప్రజలను నిలువున మోసం చేస్తోందని, మాయమాటలతో గారడి చేస్తూ పరిపాలిస్తున్నారని తెలిపారు. అత్యధికంగా బహుజనులు ఉన్న ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం మాత్రం 3శాతం ఉన్నవారు మాత్రమే అనుభవిస్తున్నారని తెలిపారు. బహుజనుల్లో ఐక్యత లేకపోవడం వల్లనే ఇతర ఆగ్రకులాల అదిపత్యం కొనసాగుతుందన్నారు. బహుజనులందరు ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. 93శాతం ఉన్న బహుజనులకు సీఎం సీటు ఎందుకు రాదని ప్రశ్నించారు. బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే మనబతుకులు బాగు పడతాయని అన్నారు.
also read;-అంబులెన్స్ డి బాలుడు మృతి
7శాతం ఉన్న ఆగ్రకులాలకు ఐటీ, పరిపాలన, ఉద్యోగాలు, రాజకీయ పదవులు, రాజ్యాధికార పదువులు వస్తున్నాయని అన్నారు. ఆ పదవుల్లో ఉంటూ పుల్ గా సంపాధించి బహుజనులను కూలీలుగా, బీచ్చగాళ్లుగా చూస్తున్నారని అన్నారు. పావలా మనకు ఇచ్చి రూపాయి దోచుకుంటున్నారని అన్నారు. అందుకే బహుజనులందరు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో బహుజనులకు రాజ్యాధికారం కావాలనే డిమాండ్ తో ముందుకు వచ్చిన బీఎస్పీ పార్టీని గెలిపించాలని కోరారు. బహుజనులకు డబ్బులు ఉండవు, ఎన్నికల్లు డబ్బులు పంచలేరని, ఉన్నవారి వద్ద డబ్బులు తీసుకుని, బహుజనులకు ఓట్లేయాలని కోరారు.
బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే మన బతుకులు మెరుగుపడతాయని, మన పిల్లలకు ఉద్యోగాలు, రాజకీయ పదవులు వస్తాయని అన్నారు. ఆగ్రకులాల వద్ద మోకరిళ్లాల్సిన అవసరం లేదని, మన కాళ్ల మీద మనం బతికేందుకు చాలా మార్గాలున్నాయన్నారు. యువకులు కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సాధించాలని కోరారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. చదువు ముందు, రాజకీయం తరువాత అని అన్నారు. చదువువల్లనే బహుజనుల్లో చైతన్యం వస్తుందన్నారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం సోసైటీ చైర్మన్ అల్లిక వెంకటేశ్వరరావు బీఎస్పీ పార్టీలో చేరారు. కాగా ప్రవీణ్ కుమార్ ఆయనకు బీఎస్పీ పార్టీ కండువ కప్పి స్వాగతం పలికారు. పార్టీ కచ్చితంగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.