Telugu News

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి

కార్యకర్తలకు సూచించిన జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల

0

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి

== కార్యకర్తలకు సూచించిన జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల

== జిల్లా అధ్యక్షుడిన్ని కలిసి జీళ్ళచెరువు పార్టీ నాయకులు, కార్యకర్తలు

(కూసుమంచి,-విజయం న్యూస్);-

కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయాలని, ఇంటింట కాంగ్రెస్ జెండా ఎగిరేవిధంగా చూడాలని, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్దంగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సూచించారు. సోమవారం కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా నాయకులు పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.

also read;-నేటి నుంచి నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనం నుండే పౌర సేవలు.

గ్రామంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణం, ఇంటింట జెండా ఎగిరేసే కార్యక్రమాలపై చర్చించారు. అందులో భాగంగానే జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కార్యకర్తలకు, నాయకులకు పలు సూచనలు, సలహాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,అందుకోసం కార్యకర్తలు, నాయకులు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేసేందుకు సన్నిద్దమైన గ్రామశాఖ నూతన కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెండ్ర అంజయ్య, హుస్సెన్, గంగరాజుయాదవ్, మద్ది వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

also read :-పువ్వాడఅజయ కుమార్ దిష్టిబొమ్మదగ్ధం
== మండల నాయకులను కలిసిన జీళ్ళచెరువు కాంగ్రెస్ టీమ్
కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు గ్రామశాఖ కాంగ్రెస్ టీమ్ సభ్యులు మండల కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ హాఫీజుద్దీన్, తుపాకుల వెంకన్న, బెల్లంకొండ కిరణ్ తదితరులను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ అనంతరం పార్టీ భవిష్యత్ కార్యచరణ అంశంపై కలిసి చర్చించారు.

ఈ కార్యక్రమంలోమండల నాయకులు మద్దెల ఉపేందర్, కాసాని వెంకన్న, ఐతగాని నాగేశ్వరరావు,దంతాల శ్రీను, పాలేరు నియోజకవర్గ యూత్ ప్రధానకార్యదర్శి ఐతగాని ప్రభాకర్, వార్డు సభ్యుడు ఐతగాని రంగయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు కత్తి శ్యామ్, ఉపాధ్యక్షుడు మొక్కరాము, ప్రధానకార్యదర్శి తమ్మరబోయిన లక్ష్మయ్య, కోశాధికారి ఐతగాని రంగయ్య, కార్యదర్శి గుమ్మడెల్లి వీరబాబు,అంబాల నాగేశ్వరరావు, గుండమాల వీరబాబు, రామడుగు నాగాచారి, సైదులు, యూత్ అధ్యక్షుడు కొండా ప్రసాద్, ప్రధానకార్యదర్శి గుమ్మడెల్లి నరేష్, సోషల్ మీడియా ఇన్ చార్జ్ నిప్పు శ్రీను, అంబాల రామనాథం తదితరులు పాల్గొన్నారు.