ఇంటర్, పది పరీక్షలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిచండి
వీడియోకాన్పరేన్స్ లో అధికారులను అదేశించిన మంత్రి సబితా
ఇంటర్, పది పరీక్షలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిచండి
== వీడియోకాన్పరేన్స్ లో అధికారులను అదేశించిన మంత్రి సబితా
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్ పదవ తరగతి పరీక్షల నిర్వహణపై గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు,
జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు.
also read :-బంద్ వేళ … పెట్రేగిన నక్సల్స్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావంతో గత రెండు సంవత్సరాలుగా పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదని, ప్రస్తుత సంవత్సరం విద్యార్థుల సన్నద్ధం కోసం అవసరమైన సమయం అందించి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. 06-5-2022 నుండి 24-05-2022 వరకు ఇంటర్ పరీక్షలు, మే 23, 2022 నుంచి జూన్ 1, 2022 వరకు పదోవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.
పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. వేసవికాలంలో పరీక్షలు నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక బస్సులు నడపాలని, విద్యార్థులను క్షేమంగా వారి ఇంటి వద్దకు చేర్చే విధంగా దీనిపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. పరీక్షల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నిర్వహణ పై ఆయా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
also read :-పినపాక లో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఈ సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ప్రతి పరీక్ష కేంద్రంలో సిసి టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవద్దని, చీఫ్ సూపరిండెంట్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్నపత్రాల కవర్ సీళ్లు ఓపెన్ చేయాలని, ఆ సమయంలో అధికారులు సెల్ఫోన్ తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద కరోన నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షలు జరుగుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 33,709 మంది విద్యార్థులు ప్రదమ, ద్వితియ ఇంటర్ మీడియట్ పరీక్షలకు హాజరవుతున్నారని ఇందుకు గాను 59 పరీక్షా కేంద్రాలను, అదేవిధంగా 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 17,592మంది విద్యార్థులకు గాను 104 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు.
also read :-పేదల భూములను లాక్కుంటారా..?
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, పరీక్షా కేంద్రాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి ఓ.ఎస్.ఆర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మధుసూదన్, అదనపు డి.సి.పి శాస్ ఆలం,జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్, జిల్లా రెవిన్యూ అధికారి శిరీష, ఆర్.టి.సి. డి.ఏం శంకర్‌రావు, ట్రాన్స్ కో డి.ఈ. రమేష్, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ సైదులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.