తలసేమియా చిన్నారులకు అండగా ఉంటా.. మంత్రి పువ్వాడ.
తలసేమియా అవగాహన కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి.
తలసేమియా చిన్నారులకు అండగా ఉంటా.. మంత్రి పువ్వాడ.
▪️తలసేమియా అవగాహన కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి.
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
తలసేమియా చిన్నారులకు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సేవలను అందిస్తామని, వారికి అన్నివిధాలుగా మంత్రి అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం వీడీవోస్ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో సంకల్ప స్వచ్చంద సేవా సంస్థ రూపొందించిన తలసేమియా అవగాహన కార్యక్రమాల పోస్టర్‌ను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నారులకు తరచు హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి వారికి ఉచితంగా బస్‌పాస్‌లు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారుల కోసం డేకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు.
also read :-పేదవారి భూములు లాక్కుంటే యుద్ధమే
చిన్నారులతో మాట్లాడిన మంత్రి మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం చిన్నారులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, సంస్థ బాధ్యులు పి.అనిత, రవిచందర్, పావని, ప్రభాకర్‌రావు, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కమర్తపు మురళి, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.