Telugu News

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై మండిపడ్డ టిడిపి

గతంలో ఇచ్చిన హావిూలు ఏమయ్యాయన్న అచ్చన్న

0

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై మండిపడ్డ టిడిపి

** గతంలో ఇచ్చిన హావిూలు ఏమయ్యాయన్న అచ్చన్న

** ప్రజలపై ఛార్జీల భారం తగదని విమర్శలు

(అమరావతి-విజయంన్యూస్):-
విద్యుత్‌ ఛార్జీల పెంపును టిడిపి తీవ్రంగా తప్పుపట్టింది. విపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హావిూలు ఏమయ్యాయని దుయ్యబట్టింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అసమర్ధ పాలనకు విద్యుత్‌ ఛార్జీల పెంపు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. పేదప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. పాదయాత్రలో ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ… స్విచ్‌ వేయకుండానే ప్రజలకు విద్యుత్‌ షాక్‌ తగిలిందన్నారు. ఇప్పటికే ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు.

also read :-రామాపురం రామాలయ అభివృద్ధికి పొంగులేటి రూ.లక్ష విరాళం

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామన్న జగన్‌.. ఇప్పుడు ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో పేదలపై 3 ఏళ్లుగా జగన్‌ రెడ్డి కక్ష సాధిస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. సంక్షేమం ఇస్తున్నాం కదా అని వారిపై మోయలేని భారం మోపుతున్నారని, పేదలు, మధ్యతరగతిపై అధికంగా విద్యుత్‌ చార్జీలు పెంచి ధనవంతులపై భారం తగ్గించడం పిచ్చి తుగ్లక్‌ పాలన కాక మరేంటని ఆయన మండిపడ్డారు. జగనన్న బాదుడే బాదుడు పథకంలో ప్రజలపై రూ.38వేల కోట్ల భారం మోపారంటూ ఆయన వ్యాఖ్యానించారు.

also read :-అల్లు అర్జున్‌,ధనుష్‌ ల కలయికలో సినిమా

రాష్ట్రంలో బతకలేం అని పేదలు వలస పోయే దుస్థితి నెలకొందని, సంక్షేమ పథకాలు పేదలకు ఎగ్గొట్టేందుకే వారిపై ఎక్కువ విద్యుత్‌ ఛార్జీల పెంపు భారం మోపారన్నారు. జగన్‌ రెడ్డి అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్‌ వ్యవస్థ గాడితప్పిందని, ట్రూఅప్‌ పేరుతో త్వరలో మరో బాదుడుకు జగన్‌ సిద్ధమయ్యారని విమర్శించారు. మద్యం, ఇసుక, గనులు, ఇతరత్రాల్లో వచ్చే కవిూషన్లపై పెట్టిన శ్రద్ధ జగన్‌ పేదలపై పెట్టలేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కరెంట్‌ బిల్లులు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శించారు.

also read :-మిషన్‌ భగీరథకు జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు

వెలిగి పోవాల్సిన ఏపీ గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయన్నారు. ఫ్యాన్‌కు ఓటు వేసిన జనం మండు వేసవిలో కనీసం ఫ్యాన్‌ గాలికి కూడా నోచుకోవడం లేదని తెలిపారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్‌ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. ఓ వైపు విద్యుత్‌ కాంతులతో దేశం వెలిగిపోతుంటే ఆంధప్రదేశ్‌ అంధకారంలో మునిగి పోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు.