Telugu News

సంక్షేమం లో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం : నామా

టీ.ఆర్.ఎస్ సర్కారు లో అన్ని వర్గాలకు పెద్దపీట

0

సంక్షేమం లో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం : నామా

▪️ టీ.ఆర్.ఎస్ సర్కారు లో అన్ని వర్గాలకు పెద్దపీట.

▪️ ప్రత్యేక రాష్ట్రంలో మారిన పల్లెల రూపురేఖలు.

▪️ టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం లోనే మధిర నియోజకవర్గ అభివృద్ధి.

➖ టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు.

▪️ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తో కలసి మధిర లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ నామ.

▪️ మూడు రైతు వేదికలు సహా సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం.

▪️ భారీ కాన్వాయ్ తో మధిర మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ నామ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం నాడు మధిర మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి పనులను జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తో కలసి ఆయన ప్రారంభించారు. ముందుగా మధిర పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు మరియు మడుపల్లి లో ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు

also read :-ధర్మతండాలో వైభవంగా శ్రీ గోపయ్య,లక్ష్మితిరుపతమ్మ కల్యాణం

అలానే మధిర మండలం రాయపట్నం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక మరియు సీసీ రోడ్డును అలానే ఇల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను, సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ టీ.ఆర్.ఎస్ సర్కారు లో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పల్లె ప్రగతి తో గ్రామాల్లో వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డు లు, పల్లె ప్రకృతి వనాలు లాంటి ఎన్నో విప్లవాత్మకమైన పథకాలతో పల్లెల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నారని అలానే రైతు బీమా తో రైతన్నలకు భరోసా కల్పిస్తున్నారని గుర్తు చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటుగా గ్రామాల్లో, పట్టణాల్లో కోతలు లేకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తామని ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గర్వకారణం గా ఉందని పేర్కొన్నారు టీ. ఆర్.ఎస్ ప్రభుత్వం లోనే మధిర నియోజకవర్గ అభివృద్ధి జరుగుతోందని భవిష్యత్ లో మధిర నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

also read :-వరి ధాన్యం కొనుగోళ్ళ పై కేంద్రం మీద పోరుకు

కార్యక్రమాల్లో TRS రాష్ట్ర నాయకులు బొమ్మెర రామూర్తి, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్ ,ఎంపీపీ మెండం లలిత వెంకన్న ,మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు , రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యాలత వెంకటరెడ్డి, మండల టౌన్ పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, మేడికొండ కల్యాణి కిరణ్, తొగురు వరలక్ష్మీ ఓంకార్, సర్పంచ్ లు నండ్రు సుశీల, కోట రామారావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, చావా రామకృష్ణ, కర్నాటి దుర్గా శ్రీనివాసరావు, అరిగే శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, గద్దల మాధురి, దీరావత్ మాధవి, నరేందర్ రెడ్డి, అబ్బూరి రామన్, యన్నంసెట్టి అప్పారావు, ఇక్బాల్, ప్యారీ, కొండయ్య, వినయ్ కుమార్, ఉద్దండయ్య, సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.