తెలంగాణ ప్రజల ఆత్మబంధువు కేసిఆర్ : మంత్రి అజయ్ కుమార్
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక భద్రత
మహిళా బంధు సంబురాల విజయవంతం
చేయాలి
ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపు
(విజయం న్యూస్):-
ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ నేతృత్వంలో సబ్బండ వర్ణాల వారి సంక్షేమం పరుగులు పెడుతూ, సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పునాదులు వేస్తుందని మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరూ ఆత్మగౌరవంతో నిలబడేలా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మ బంధువుగా ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ నిలిచిపోతారని మంత్రి శ్రీ అజయ్ పేర్కొన్నారు.
also read;-రైతు బంధు రైతులను ముంచే పథకం
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీ కేటీఆర్ పిలుపుతో ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించే కేసీఆర్ మహిళాబంధు కార్యక్రమంలో ప్రతి మహిళ భాగస్వామి కావాలని మంత్రి కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో షెడ్యూల్ ప్రకారం ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని, నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి శ్రీ అజయ్ విజ్ఞప్తి చేశారు.
మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రత కోసం షీటీమ్‌లు, గర్భిణుల కోసం కేసీఆర్ కిట్స్, అమ్మఒడి లాంటి పథకాలు ప్రవేశపెట్టి, అండగా నిలుస్తున్నారని, అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో సైతం మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇటీవలే ‘మై బస్ ఇస్ సేఫ్’ పేరుతో మహిళల రక్షణకు తెలంగాణ ఆర్టీసీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.
also read;- మూడోసారి కేసీఆర్ కి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.: లింగాల కమల్ రాజు
ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ అని, దేశంలోనే తొలిసారిగా 1,32,504 మంది ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా కేసిఆర్ ప్రత్యేక గుర్తింపు సాధించారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేవిధంగా ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటుచేసిందని ఇవి నిలువెత్తు చైతన్యదీపికలుగా విరాజిల్లుతున్నాయన్నారు.
నాడు తెలంగాణలో ఆడబిడ్డలు మంచినీటి కోసం దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు వర్ణనాతీతమని ఆ కష్టాలకు శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రి కేసీఆర్ చూపారని తడారిన గొంతులను గోదావరి, కృష్ణాజలాలతో తడిపారని చెప్పారు. ఆర్థికంగా, రాజకీయంగానే కాదు పారిశ్రామిక రంగంలోనూ మహిళలు సత్తా చాటాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని అందుకే రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళల కోసం 4 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.