Telugu News

తెలంగాణ వడ్లు కొనల్సిందే.. తేల్చుకునే వస్తాం.. మంత్రి పువ్వాడ.

- నియోజవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పోన్ లో స్పష్టం చేసిన మంత్రి పువ్వాడ.

0

తెలంగాణ వడ్లు కొనల్సిందే.. తేల్చుకునే వస్తాం.. మంత్రి పువ్వాడ.
– నియోజవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పోన్ లో స్పష్టం చేసిన మంత్రి పువ్వాడ.
== ఖమ్మంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శవయాత్ర
== దిష్టిబొమ్మను దగ్దం చేసిన నేతలు
(ఖమ్మం ప్రతినిధి – విజయంన్యూస్)
తెలంగాణ వడ్లను కేంద్రం కొనాల్సిందే అని, పంజబ్ కి ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం ఉంటదా అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలను పెంచినందుకు నిరసనగా తీసుకోబోయే కార్యాచరణలో భాగంగా ఖమ్మం వీడీవోస్ క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి పువ్వాడ ఫోన్ ద్వారా శ్రేణులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ. యాసంగిలో దొడ్లు.. వడ్లు కొనమని కేంద్రం అండం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వములో మంత్రులబృందం రావడం జరిగిందన్నారు. కేంద్ర మంత్రితో నేడు భేటీ ఉందని, సానుకూల స్పందన రాని పక్షంలో కేసీఅర్ నాయకత్వములో బిజేపి మేడలు వంచి కనిపిస్తామని స్పష్టం చేశారు.పంట సేకరణలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక విధానం.. పంజాబ్‌లో మరో విధానాన్ని అవలంభిస్తున్నదని మండిపడ్డారు.

తెలంగాణలో రైతులు పండించిన ధ్యాన్యాన్ని ఎందుకు కొనరో రైతులకు వివరించాలన్నారు. తెలంగాణ భారతదేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రస్తుతం రాష్ట్రంలో వరి ఎక్కువగా పండిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నీళ్లున్నా వరి వేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. పండించిన పంటను కేంద్రం కచ్చితంగా కొనితెరల్సిందే అన్ని అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు ఒప్పించాలని హితవు పలికారు.

రైతుల ఆగ్రహనికి కమలం మాడిపోతుందని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దు, రాష్ట్రంలో వడ్ల కొనుగోలుపై, కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని, దేశంలో ఎక్కడాలేని పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు.

దీనికి తోడు ప్రజలపై అదనపు భారాలు మోపే చర్యల్లో భాగంగనే ఇష్టానుసారంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను విచ్చలవిడిగా పెంచినందుకు పెద్ద ఎత్తున నిరసన ను తెలపాలని కోరారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొనాలని కొరుతు మంత్రుల్ని కలిసేందుకు ఢిల్లీ వచ్చామని, తేల్చుకునే తెలంగాణ వస్తామని మంత్రి పేర్కొన్నారు.

also read :- దేశానికి శ‌క్తిగా ఉండే యువ‌త ఉద్యోగ స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోరా?
== పేదలను దోచుకునేందుకు కేంద్రం కుట్ర: మంత్రి అజయ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో స్థూల జాతీయోత్పత్తి ( జీడీపి ) పెరుగుదలంటే “గ్యాస్, డీజిల్ పెట్రోల్ ధరల” పెరుగుదలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యల్పంగా ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఉపశమనం కలిగించలేదని మంత్రి ఆరోపించారు. అందువల్ల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలను పెంచే నైతిక అధికారం కేంద్రానికి లేదన్నారు. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో, ఇంధనం యొక్క రిటైల్ ధరలో సమీప పెరుగుదల గురించి కేంద్రం ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోందని విమర్శించారు. అమాంతం పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ధరలు సామాన్య, పేద ప్రజలకు శాపంగా మారుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారని దాని ఫలితంగా లాక్‌డౌన్ మరియు ఇంధన ధరలలో పెంపుదల వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారాన్ని గ్రహించి, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల నుండి పౌరులకు ఉపశమనం కలిగించాలన్నారు. దేశం అకారణంగా స్తబ్దత దశకు గురౌతోందని, ఇందులో వృద్ధి రేటు రివర్స్ అవుతూ మరియు ద్రవ్యోల్బణం పెరుగుతోందని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను పెంచడం ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి రూ.10,000 కోట్లు దోచుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక ఆలోచనా ధోరణి మరోసారి బట్టబయలైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.

also read :-గిదేంది సారూ..? మా పొట్టకొట్టకుండ్రీ.
== పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెంపు కు నిరసన.. కేంద్రం దిష్టి బొమ్మ దహనం..
సామాన్య ప్రజలపై అత్యంత భరాన్ని మోపే విధంగా, అడ్డు, అదుపు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు వీడీవోస్ కాలనీలోని మంత్రి గారి క్యాంపు కార్యలయం నుండి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు ఖమ్మం నియోజకవర్గం తెరాస శ్రేణులు కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మతో శవ యాత్ర చేపట్టారు. ఖాళీ సిలిండర్ లు భుజాలపై ఎత్తుకుని, ఆటో ను తాడు తో లాగి నిరసన తెలిపారు.

అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్ నందు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం దహనం చేసి మోడీ డౌన్.. డౌన్.. అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చువిజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ క్రిష్ణా, నగరకమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు క్రిష్ణచైతన్య తదితరులు హాజరైయ్యారు.

also read:-బదిలీపై 24 గంటల్లో వెళ్లాల్సిన ఓ ఎస్ఐ అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కాడు.