Telugu News

ఖమ్మం నగరంలో రోజంతా ఉద్రిక్తత..

బీజేపీ నాయకుడు సాయిగణేష్ మత

0

ఖమ్మం నగరంలో రోజంతా ఉద్రిక్తత..
== బీజేపీ నాయకుడు సాయిగణేష్ మత
== ఆగ్రహించిన బీజేపీ నేతలు
== ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిపై బీజేపీ కార్యకర్తల దాడి
== అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం
== ధర్నాలు. ఆందోళనలు…
== పరిస్థితి ఉద్రిక్తత …పువ్వాడ ఫ్లెక్సీలకు నిప్పు
== బీజేపీ కార్యకర్తలపై టీఆర్ యస్ కార్యకర్తల దాడి ..
== బీజేపీ నాయకుడు టీవి చంద్రశేఖర్ గాయాలు
== హైద్రాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన బీజేపీ నాయకులు
== మంత్రి వేధింపులే కారణమని ఆరోపణ
== అజయ్ ని ఏ 1 నిందితుడిగా చేర్చాలని బీజేపీ డిమాండ్

(ఖమ్మం  -విజయం న్యూస్):-

బీజేపీ యువకార్యకర్త , మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సాయి గణేష్ చౌదరి శనివారం హైదరాబాద్ లో ఓఆసుపత్రిలో చనిపోయాడు. దీంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి ఆయన మతదేహం వచ్చినప్పటికి శవపరీక్ష్ చేసే విషయంలో ఆలస్యమైందని భావించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రిలోనే ఆందోళనకు దిగారు.. ప్రభుత్వాసుపత్రిపై దాడి చేశారు. ప్లెక్సిలకు నిప్పంటించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ నాయకులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఆసుపత్రిలోనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

also read :-పోడు రైతులకు పట్టాలేప్పుడిస్తారు..?

దొరికింది దొరికినట్లు ద్వంసం చేసే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా సుమారు నాలుగు గంటల పాటు చోటు చేసుకున్న ఈ సంఘటనతో ఖమ్మంలో ఉద్రికత్తతకు దారి తీసింది. టెన్షన్ వాతావరణం నేలకొంది.. దీంతో పోలీసులు ఆసుపత్రిలో భారీ బందోబస్తు నిర్వహించారు. అలాగే అన్ని వీధుల్లో బందోబస్తును నిర్వహించారు. పోలీసులందరు అప్రమత్తమైయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ కు చెందిన బీజేపీ మజ్దూరి యూనియన్ జిల్లా అధ్యక్షుడు సాయిగణేష్ చౌదరి గత కొద్ది రోజుల క్రితం 46వ డివిజన్ లో పార్టీ గద్దెను నిర్మాణం చేసి జెండా అవిష్కరణ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన పంచాయతీలో పోలీసులు జెండా అవిష్కరణ అడ్డుకునే ప్రయత్నం జరిగింది. కానీ సాయి, వారి కార్యకర్తలు జెండా అవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఆ తరువాత పోలీసులు సాయిని అరెస్టు చేసే ప్రయత్నంలో సాయి పోలీస్ స్టేషన్ అవరణంలో గత రెండు రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో స్థానికులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. కాగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న సాయిగణేష్ శనివారం ఉదయం చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. 46వ డివిజన్ లో, బీజేపీ పార్టీలో విషాదం నేలకొంది.

also read :-డిల్లీలో మళ్ళీ…! డిల్లీలో 24 గంటల వ్యవధిలోనే 50 శాతం అధికంగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
== శవపరీక్ష ఆలస్యం.. అంతలోనే ఆందోళన. ఉద్రిక్తత.. దాడులు
సాయి గణేష్ మరణించారన్న వార్త ఖమ్మంలో ఉద్రిక్తతలకు దారితీసింది. హైదరాబాద్ నుంచి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి సాయిగణేష్ మ్రుతదేహాన్ని తీసుకరాగా, పోస్టుమార్టం చేసే విషయంలో ఆలస్యమైంది. దీంతో కోపోద్రిక్తుతులైన బీజేపీ కార్యకర్తలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిపై దాడి చేసి ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఫర్నిచర్ పగలగ్గొట్టారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రికత్త పరిస్థితి నేలకొంది. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దాడులు చేస్తే వచ్చేదేమి లేదని, కచ్చితంగా న్యాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలోనే ధర్నాకు కుర్చున్నారు. ఆందోళన చేశారు. ఈ ధర్నాకు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, రాష్ట్ర కిసాన్ మోర్చ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్, జిల్లా నాయకత్వం హాజరైయ్యారు.

బీజేపీ

also read :-అసమానతలపై అంబేడ్క‌ర్‌ అలుపెర‌గ‌ని పోరు

== మంత్రి ప్లెక్సీలకు నిప్పుపెట్టిన  నాయకులు.. బీజేపీ నాయకులపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు
ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఆందోళన జరుగుతున్న సమయంలోనే మమతా ఆసుపత్రి రోడ్ లో గల మంత్రి అజయ్ ఫ్లెక్సీలు బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిప్పు పెట్టారు. అజయ్ కు, టీఆర్ యస్ కు వ్యతిరేకంగా డౌన్ ,డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో అగ్రహించిన టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు మమతా రోడ్ లో బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ నాయకుడు, హిందు వాహిణి జిల్లా అధ్యక్షుడు టి.వి. చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలయ్యాయి. తలపై పెద్దగా గాయం కావడంతో ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. ప్రధాన రహదారిపై బేటాయించారు. మంత్రిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. గాయపడిన చంద్రశేఖర్ ను ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్సను అందిస్తున్నారు.

== హాజరైన రాష్ట్ర నాయకులు
ఖమ్మంలో జరుగుతున్న బీజేపీ ఆందోళనకు రాష్ట్ర బీజేపీ నాయకులు హాజరైయ్యారు. కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీదర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కార్పోరేటర్ దొంగల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఖమ్మం జిల్లా ఇన్ చార్జ్ కడగంచి రమేష్, రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీఫ్ కుమార్, గిరిజనమోర్చ జిల్లా అధ్యక్షుడు రవిరాథోడ్, ప్రధాన కార్యదర్శులు రుద్రప్రదీప్, శ్యామ్ రాథోడ్, నున్న రవికుమార్ ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో జరిగే ధర్నాలో పాల్గొన్నారు.
== ఇది కచ్చితంగా పోలీసుల హత్యే : ప్రేమేందర్ రెడ్డి
బీజేపీ కార్యకర్తలు, నాయకులపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిటికి మాటికి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అందులో భాగంగానే సాయిగణేష్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నం చేశారని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమందర్ రెడ్డి అన్నారు. పోలీసులు, మంత్రి ఒత్తడి వల్లనే బీజేపీ నాయకుడిపై రౌడి షీట్ పెట్టారని, అందుకే మనస్థాపంతో సాయి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. దీనంతటికి మంత్రి కారకుడని, పోలీసులే హత్యచేయించారని ఆరోపించారు. కచ్చితంగా పోలీసులపై, మంత్రిపై పూర్తి స్తాయి విచారణ జరిపించాలని, మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

== సాయి గణేష్ భౌతిక కాయం ఊరేగింపుకు అనుమతి నిరాకరణ
పోస్ట్ మార్టం అనంతరం సాయి గణేష్ భౌతిక కాయం ఊరేగింపుగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటికి అక్కడ నుంచి కాల్వ ఒడ్డులోని శంషానా వాటికకు తీసుకోని వెళ్లాలని బీజేపీ నిర్ణయించగా అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
== మంత్రి అజయ్ భాద్యత వహించాలి :బండి సంజయ్
ఖమ్మం లో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కు మంత్రి పువ్వాడ అజయ్ భాద్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఖమ్మంలో జరిగిన ఉద్రిక్తత పరిస్థితులపై ఆరా తీసిన బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యానారాయణకు పోన్ చేసి మాట్లాడారు. దీంతో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకుడు ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించి మంత్రితోపాటు బాద్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .

నా మనవణ్ణి పోలీసులు , పువ్వాడ అజయ్ కలిసి చంపారంటున్న సాయి గణేష్ అమ్మమ్మ
నా మనవణ్ణి పోలీసులు , పువ్వాడ అజయ్ కలిసి చంపారని సాయి గణేష్ అమ్మమ్మ ఆరోపిస్తున్నారు . మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉందని ఆమె బోరున విలపిస్తున్నారు . తల్లిదండ్రులు లేని సాయి గణేష్ నాదగ్గరే పెరిగి పెద్ద వాడు అయ్యాడని ,తాను వాడికోసమే బతుకు తున్నానని ఇప్పడు తనకు ఎవరు దిక్కు లేనందున తనను కూడా చంపి వేయాలని రోదిస్తున్నారు