Telugu News

గద్వేల్ లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత

ఇరువర్గాల ఘర్షణ..లాఠీకి పనిచెప్పిన పోలీసులు

0

గద్వేల్ లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత

** ఇరువర్గాల ఘర్షణ..లాఠీకి పనిచెప్పిన పోలీసులు

(జోగులాంబగద్వేల్-విజయంన్యూస్);-
రాజ్యంగ నిర్మాత, దేశానికే ఆదర్శప్రియుడు డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో రెండు వర్గాల వారు తన్నులాడుకున్నారు. ఎదైతే జరగోద్దని డాక్టర్ అంబేద్కర్ కలలు కన్నాడో.. అది చేసి చూపించారు గద్వాల్ నాయకులు.జిల్లాలోని కేటిదొడ్ది మండలం ఇర్కిచేడులో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడి0ది.

also read;-పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్‌

రెండు వర్గాలుగా విడిపోయిన విగ్రహావి ష్కరణ కమిటీ సభ్యులు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని… ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకూ వినని ఓ వర్గం వ్యక్తులు అంబేద్కర్‌ విగ్రహానికి నిప్పంటించారు. దీంతో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారికి నిప్పంటుకుంది. కాగా ప్రత్యర్థి వర్గం వారు వెంటనే స్పందించి.. అంబేద్కర్‌ విగ్రహానికంటుకున్న మంటలను ఆర్పేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకుని పరిస్థితులను చక్కదిద్దారు