Telugu News

టిఆర్ఎస్ దౌర్జన్యాలపై సీబీఐ విచారణ జరపాలి.

సాయి గణేష్ కుటుంబానికి ఈటెల పరామర్శ..

0

టిఆర్ఎస్ దౌర్జన్యాలపై సీబీఐ విచారణ జరపాలి..

సాయి గణేష్ కుటుంబానికి ఈటెల పరామర్శ..

(ఖమ్మం విజయం న్యూస్):-

టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అన్ని ఆత్మహత్యలు, దౌర్జన్యాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.ఖమ్మంలో సాయి గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈటల రాజేందర్. సాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఈటల రాజేందర్.. టీఆర్‌ఎస్‌ దౌర్జన్యాలకు, బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు భయపడొద్దన్నారు. ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప, ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు ఈటల. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయండని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. టిఆర్ఎస్ నేతలు, పోలీసులు అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. శిశుపాలుడు ఏ విధంగా 100 తప్పులు చేసి శిక్షకు గురయ్యాడో సీఎం కేసీఆర్ కూడా వంద తప్పులు చేశారని, ఇక శిక్ష తప్పదని అన్నారు. సాయి గణేష్ ఆత్మహత్యకు కారకులైన టిఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

also read :-ఆటోలోనే సూట్ కేస్ ను మార్చిన యువకుడు..

తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌పై విశ్వాసం కోల్పోయారని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అక్రమాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేసీఆర్‌ను గద్దెదించే సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటామని, ధైర్యంగా పోరాడదామని అన్నారు. సాయి గణేష్ కుటుంబానికి అండగా నిలబడతామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

also read ;-నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు…..9మంది పై కేసు…!

సాయి గణేష్ పై అక్రమ కేసులు పెట్టి.. పోలీసులు వేదించారని.. ఇందుకు బాద్యుడైన మంత్రి పువ్వాడ అజయ్‌పై ఇప్పటివరకు కేసులు పెట్టలేదన్నారు. డబ్బులు తీసుకోవాలని పోలీసులు సాయి గణేష్ కుటుంబాన్ని ఒత్తిడి చేస్తున్నారని.. అమిత్ షా ఫోన్‌లో పరామర్శించి దైర్యం చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత ముస్తఫా పై కూడా రౌడీ షీట్ పెట్టి జైలుకు పంపారు.

పాలేరులో సొంత పార్టీ నేతలపై కూడా కేసులు పెడుతున్నారు.. 2023 లో ఖమ్మం జిల్లాలో నీ అడ్రస్ గల్లంతు అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి రాజకీయాలు చేసేవారు అతి కొద్ది రోజుల్లోనే కాల గర్భంలో కలిసిపోయి చరిత్ర హీనులుగా మిగులుతారని అన్నారు. రామాయంపేట, సాయి గణేష్ ఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు.