ఖమ్మం తెరాస నిరసన దీక్షకు ఛాంబర్ ఆప్ కామర్స్ సంపూర్ణ మద్దతు
ప్రకటించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్, కార్మిక సంఘాలు
ఖమ్మం తెరాస నిరసన దీక్షకు ఛాంబర్ ఆప్ కామర్స్ సంపూర్ణ మద్దతు
★ ప్రకటించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్, కార్మిక సంఘాలు
★ మంత్రి అజయ్ తో కలిసి సంయుక్త పోరాటం చేసేందుకు అంగీకారం
(ఖమ్మం-విజయం న్యూస్);-
రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస పార్టీ చేస్తున్న ఉద్యమ పోరాటానికి ఖమ్మం వ్యాపారస్తుల ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యవసాయ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్నను కలిసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెరాస ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈనెల 7న ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతన జరగనున్న నిరసన దీక్షలో పాల్గొంటామని హామినిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు.
also read;-టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ వద్ద మహాధర్నా
ఉమ్మడి పాలనలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, కాలిపోయిన మోటర్ల బాధలు, రైతులకు తీరని కష్టాలు ఉండేవని పేర్కొన్నారు
కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్యుల నడ్డి విరిచేలా ఉన్నాయని సిమెంట్, స్టీల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో పేదవాడు ఇల్లు కట్టుకునే అవకాశం లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ధరలు పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవన్నారు. ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమర్థవంతమైన నాయకత్వంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. గురువారం ఉదయం మంత్రి అజయ్ అధ్వర్యంలో జరిగే నిరసన దీక్షకు పత్తి మార్కెట్ నుంచి భారీ ర్యాలీగా దీక్షాస్థలికి చేరుకోవాలని నగర వ్యాపారులకు, కార్మికులకు, వారు విజ్ఞప్తి చేశారు.