Telugu News

టీఆర్ఎస్ పతనం షూరు ఖాయం

ఎన్నికలకు మరో ఏడాది కాలమే

0

టీఆర్ఎస్ పతనం షూరు ఖాయం
==ఎన్నికలకు మరో ఏడాది కాలమే
== మంత్రి పువ్వాడ ను వదిలేది లేదు
== అక్రమ కేసులుపెట్టే అధికారులకు మిత్తితే చెల్లిస్తాం
== టీర్‌ఎస్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు
== రైతులకు భరోసా కల్పంచేందుకే రాహుల్ వరంగల్ పర్యటన
== వరంగల్ సభకు భారీగా తరలిరాండి
== ఖమ్మం సన్నాహక సమావేశంలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క
== రేవంత్ రెడ్డికి అడుగడుగున ఘన స్వాగతం
== జననీరాజనం పలికన జనం
== ప్ల్లెక్సీల చించివేత.. డీజీలకు అనుమతి నిరాకరణ
== రోడ్డేక్కిన కాంగ్రెస్ నేతలు.. రాస్తారోకో..
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
టీఆర్ఎస్ పార్టీకి , తెలంగాణ ప్రభుత్వం పతనానికి వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణే నాంది కాబోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పతనానికి 365 రోజులే మిగిలున్నాయని, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందుకు సన్నిద్దం కావాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు. టిఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు. వరంగల్ జిల్లాలో వచ్చెనెల 6న జరిగే రైతు సంఘర్షణ సభ కు జన సమీకరణ కోసం ఖమ్మం జిల్లాలో నాయకులు, కార్యకర్తలతోసన్నాహక సమావేశం నిర్వహించగా, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకచౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ చార్జ్ లు కుసుమ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిలుగా హాజరైయ్యారు.

also read :-మంత్రి ఒక సైకో..?

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. వరిధాన్యం కొనుగోలు చేయమని, వరి వేస్తే ఉరే అంటూ ప్రచారం చేసిన సీఎం కేసీఆర్ మాటలు విన్న రైతులు 20లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేయలేదన్నారు. అలాగే వరి పంటను ఎవరు కొనరు, రైతులు ఎవరికైనా అమ్ముకోవాలని ప్రకటనలు చేయగానే రైతులు భయాందోళనకు గురై దళారులకు అగ్గువకు పంటను అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ గల్లా పట్టి ప్రశ్నిస్తే దిగొచ్చిన సీఎం కేసీఆర్ కేంద్రం కొనకపోయిన మేమే చివరి గింజ వరకు కొంటామని చెప్పిండు అని పేర్కొన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో కేసీఆర్ మాటలకు మోసపోయి పంటను నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.15,000, అగ్గువకు అమ్ముకున్న రైతులకు క్వింటాకు రూ.500 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

also read :-వివాహానికి ములుగు జిల్లా ఎమ్మెల్యే ధనసరి

రైతులకు న్యాయం చేయకపోతే రైతుల పక్షాన నిలబడి కోట్లాడతమని, ధాన్యం కొనుగోలు చేసే విషయంలో ఎట్ల నిలదీసినమో..? కచ్చితంగా నష్టపరిహారం ఇప్పించేందుకు అట్లనే కొట్లాడతమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాలను, భవిష్యత్ లో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి భరోసా కల్పిస్తుందో చెప్పేటందుకే రాహుల్ గాంధీ వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభకు వస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సభకు రైతులందరు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో చనిపోయిన రైతుల సాక్షిగా వరంగల్‌ జిల్లాకు అందరూ కదలిరావాలని అన్నారు. 42 లక్షల మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, ప్రతి బూత్‌ నుంచి 9 మంది సభకు తరలిరావాలని చెప్పారు. ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్‌ ఖిల్లా అని మరోసారి నిరూపించాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.
== మంత్రి పువ్వాడ మాసిక రోగి
మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌పై రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి పువ్వాడ ఓ సైకోనని, అతనికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. పువ్వాడ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈడీ కేసులు, కాంగ్రెస్‌ కార్యకర్తల మృతి, మమత కాలేజీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని అన్నారు. దమ్ముంటే పువ్వాడే తనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాలని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. బీజేపీ కార్యకర్త మంత్రి పువ్వాడ వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్‌ ఆరోపించారు. మంత్రి పువ్వాడ తమ కులాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించాడు.

also read :-రఘునాథపాలెం మండల టిఆర్ఎస్ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం

మంత్రి వల్ల కమ్మ కులానికి చెడ్డపేరు వస్తుందని, అతన్ని కులం నుంచి బహిష్కరించాలని కమ్మపెద్దలను రేవంత్‌ కోరారు. ప్రస్తుతం ఇతర పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల పేర్లు డైరీలో రాసి పెడుతున్నానని, మిత్తి సహా వారికి తిరిగి చెల్లిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు వాటిని ఉల్లంఘిస్తున్నారని, ఆ ఆఫీసర్లు రిటైర్‌ అయినా వారిని కోర్టుకు లాగుతామని రేవంత్‌ రెడ్డి చెప్పారు.
== ఛలో వరంగల్ పోదామా..? : భట్టి
వరంగల్ జిల్లాలో జరిగే రైతు సంఘర్షణ సభ దేశ రైతాంగానికి, రాష్ట్ర ప్రజానికానికి దిశానిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేశామని, రైతులకు భరోసా కల్పించేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఛలో వరంగల్ పేరుతో ఖమ్మం జిల్లానుంచి భారీగా జన సమీకరణ చేయాలని, సుమారు లక్షన్నర మంది రైతులు, ప్రజలు తరలిరావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు జీవనమరణ సమస్య అని, వరంగల్ లో ప్రజాగర్జన కు టీఆర్ఎస్ బెంబేలేత్తిపోవాలని పిలుపునిచ్చారు.
== మంత్రి పువ్వాడ సంగతి నేను చూసుకుంటా..: రేణుక
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంగతి నేను చూసుకుంటానని మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి అన్నారు. అధికారం చేతులో ఉంది కదా అని ఇష్టానుసారంగా మంత్రి అక్రమ కేసులు బనాయిస్తున్నాడని, ఆ కేసులకు కాంగ్రెస్ పార్టీ సైనికులు భయపడరని, మంత్రి పువ్వాడ కుయుక్తులు కాంగ్రెస్ బిడ్డల వద్ద కుదరవని పేర్కొన్నారు. మంత్రికి ఎవరేవరు అండగా ఉంటున్నారో అంతా చిట్టా రాస్తున్నామని, రాబోయే మా ప్రభుత్వంలో ఆ అధికారుల సంగతి తెలుస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలకు మేము అండగా ఉంటామని కచ్చితంగా తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
== అడుగడుగున ఘన స్వాగతం
ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడుగుడుగన నిరాజనం పలికారు. ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన నాయకన్ గూడెం గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రామసహాయం మాదవిరెడ్డి, వైరా నియోజకవర్గ నాయకులు రాందాసునాయక్, కొత్తగూడెం నాయకులు యడవల్లి క్రిష్ణ, కొత్తా సీతారాములు, మండల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో వచ్చిన జనంకు నాయకన్గూడెం సరిహద్దు దద్దరిల్లిపోయింది.

also read :-ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు , వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి

అలాగే భారీగా కాన్వాయి నిర్వహించారు. నాయకన్గూడెం, పాలేరు గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జీళ్ళచెరువు గ్రామంలో నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అక్కడ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను రేవంత్ రెడ్డి అవిష్కరించారు. అలాగే తల్లంపాడు గ్రామంలో, మద్దులపల్లిలో, వరంగల్ క్రాస్ రోడ్డు, ఖమ్మం కాల్వోడ్డలో ఘనస్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. అనంతరం కాల్వోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కోలాటాలు, కొమ్మున్రుత్యం, డప్పు డ్యాన్సులతో భారీ ర్యాలీగా రేవంత్ రెడ్డి పార్టీ కార్యాలయంకు చేరుకున్నారు.
== డీజేకీ అనుమతివ్వని పోలీసులు.. ప్లెక్సీలను చింపేసిన అధికారులు.. నేతల రాస్తారోకో
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీలను కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పాత బస్టాండ్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అధికారులు చొరవ తీసుకోవడంతో గొడవ సద్దుమనిగింది. అలాగే పాలేరు గ్రామంలో డీజేకి అనుమతి లేదని పోలీసులు అడ్డుపడటంతో పార్టీ నాయకులు రామసహాయం మాదవిరెడ్డి ఆధ్వర్యంలో నడిరోడ్డుపై రాస్తారోకో చేశారు. ఆ తరవాత పోలీసులు ఆందోళన కారులతో మాట్లాడి డీజేకి అనుమతిని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ జావిద్, నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు.