Telugu News

హమాలీలు ఓట్లు వేసే యంత్రాలు కాదు.

పట్టించుకోకపోతే పుట్టగతులు ఉండవు

0

హమాలీలు ఓట్లు వేసే యంత్రాలు కాదు

పట్టించుకోకపోతే పుట్టగతులు ఉండవు

ఆల్ అమాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్

ఖమ్మం:– వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న హమాలీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారని, హమాలీలను పట్టించుకోని మా డిమాండ్లు నెరవేర్చకపోతే పాలకులకు రాబోయే ఎన్నికల్లో పుట్టగతులుండవని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు.

స్థానిక ఖమ్మం అర్బన్ తహసిల్దార్ కార్యాలయం ముందు ఆల్ అమాలి డిమాండ్లపై జిల్లా ధర్నాను చేపట్టడం జరిగింది. జిల్లా అధ్యక్షులు భూక్య శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా లో పాలడుగు సుధాకర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా హమాలీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే కాదన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే అన్ని రకాల హమాలీలకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేసి సంబంధిత యాజమాన్యాల ద్వారా గుర్తింపు కార్డులను ఇప్పించాలని డిమాండ్ చేశారు.

ఎటువంటి ఆపద వచ్చినా వారిని ఆదుకునేందుకు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ బోర్డు ని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ఖజానా నుండి కనీసం రెండు శాతం బడ్జెట్ నైనా వీరి సంక్షేమం కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో హమాలిలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రభుత్వ గోడౌన్లలో పనిచేసే హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదవశాత్తు మరణించిన హమాలీల కి రూ.10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కార్మిక చట్టాల సవరణ వెంటనే ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో లో సి ఐ టి యు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు టి. విష్ణు, ఆల్ అమాలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీకాంత్, టియిడియఫ్ జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాస రావు, సి ఐ టి యు జిల్లా నాయకులు తుశాకుల లింగయ్య, మాచర్ల గోపాల్, పెరుమాళ్ళపల్లి మోహన్ రావు, శీలం నరసింహారావు, ముదాం శ్రీనివాసరావు, కుందనపల్లి నరేంద్ర, పగిడి కత్తుల నాగేశ్వరరావు, మేడికొండ నాగేశ్వరరావు, వేల్పుల నాగేశ్వర రావు, పాశం సత్యనారాయణ, మండల వీరస్వామి, వీరన్న , అమరావతి, వినయ్, లక్ష్మయ్య, షేక్ బడే మియా, మట్టపల్లి ఎంకన్న, చంద్ర గాని రామ్మూర్తి, శ్రీశైలం, కృష్ణ , వెంకట నారాయణ, బుజ్జి, పీరయ్య, మల్లికార్జున్, మండల వీరస్వామి, మురళీ, శీను, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

also read :- రాగల 24గంటల్లో మరో అల్పపీడనం.