Telugu News

ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది..మంత్రి పువ్వాడ.

ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి.

0

ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది..మంత్రి పువ్వాడ.

▪️ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి.

▪️మృతుడి భార్య పుష్ప కు ప్రమాద భీమా చెక్కు అందజేత.

(ఖమ్మం విజయం న్యూస్ ):-

ఖమ్మం నగరం 8వ డివిజన్ కు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కొత్తపల్లి రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.రమేష్ టీఆర్ఎస్ ప్రమాద బీమాలో సభ్యత్వం పొందడంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సిఫారసు మేరకు బీమా పథకం కింద మంజూరైన రూ. 2లక్షల చెక్కును శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మృతుడి సతీమణి పుష్పకు అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..
క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు.టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని ఆయన అన్నారు.ప్రభుత్వ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పథకంలో సభ్యత్వం తీసుకోవాలని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలనీ సూచించారు.